విలాసాల కోసం చోరీల బాట

20 Mar, 2017 01:04 IST|Sakshi
  • ఏడుగురు యువకుల అరెస్ట్‌
  • రూ.10 లక్షల బంగారు ఆభరణాల స్వాధీనం 
  • కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : 
    వారందరూ యువకులు..  ఇంటర్‌ చదివారు.. సినిమాల ప్రభావంతో విలాస వంత మైన జీవితానికి అలవాటు పడ్డారు. కష్టపడకుండా అడ్డదారిన డబ్బు సంపాదించాలనే అత్యాశతో చోరీల బాట పట్టారు.. కాకినాడ సిటీ పరిధిలో ఏడు నెలలుగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళలను తాళ్లతో బంధించి, కంట్లో కారం కొట్టి.. బంగారాన్ని దోచుకుపోతున్నారు. బైక్‌లపై పరారయ్యే వీరు.. అడ్డొచ్చిన వారిపై నిర్దాక్షిణ్యంగా దాడులకు పాల్పడ్డారు.  ఈ చోరీలకు పాల్పడుతున్న ఏడుగురిని ఎట్టకేలకు కాకినాడ టూటౌ¯ŒS క్రైం పోలీసులు అరెస్ట్‌ చేసి వారి నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన 38 కాసుల బంగారు ఆభరణాలు, రూ.10 వేలు, మోటార్‌ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. టూటౌ¯ŒS క్రైం పోలీస్‌ స్టేషన్లో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ ఏఆర్‌ దామోదర్‌  ఈ వివరాలను వెల్లడించారు. ఏడుగురిని అరెస్ట్‌ చేయడంలో కీలకంగా వ్యవహరించిన క్రైం డీఎస్పీ ఎ.పల్లపురాజు ఆధ్వర్యంలో క్రైం ఎస్సైలు రామారావు, రవికుమార్, హెచ్‌సీ గోవిందరావు, పీసీలు చిన్న, శ్రీరామ్, వర్మ, అజయ్, బాబు, రాములకు ఎస్పీ రవిప్రకాశ్‌ త్వరలో రివార్డులను అందించనున్నట్టు తెలిపారు.
    వరుస చోరీల చిట్టా...
    ఈ నిందితులు వరసగా చేసిన చోరీల వివరాలను ఏఎస్పీ వివరించారు. ఆయన కథనం ప్రకారం ఇలా ఉంది. కాకినాడ భానుగుడి సెంటర్‌ కృష్ణా లాడ్జి పక్కన కొప్పర్తి తిరుపతమ్మ ఇంట్లోని పని మనిషి కాలపురెడ్డి కృష్ణవేణికి నడకుదురుకు చెందిన యువకుడు తమరాన అశోక్‌కుమార్‌తో పరిచయం ఉంది. సెల్‌ఫో¯ŒS కొనుగోలుకు అతడు రూ.5 వేలు  కృష్ణవేణిని అడిగితే పనిచేసే ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్రోత్సహించింది. అన్నమ్మఘాటీకి చెందిన పైలా మõßహేష్‌తో కలసి సెప్టెంబర్‌ 19వ తేదీ రాత్రి తిరుపతమ్మను గాయపరిచి ఆమె మెడలో ఉన్న మూడు కాసుల బంగారపు తాడు, మంగళసూత్రాలను అపహరించుకుపోయారు. 
    ఇదే రోజు రాత్రి కాకినాడ న్యూ రైల్వేపోర్ట్‌ స్టేష¯ŒSలో రైల్వే రిజర్వేష¯ŒS కౌంటర్‌ నుంచి బయటకు వస్తున్న యువకుడు భారపు విజయరాఘవేంద్రస్వామి చేతిలోని క్యాష్‌ బేగ్‌ను వీరు బైక్‌పై వెళుతూ లాక్కొనిపోయారు. రాఘవేంద్రస్వామి తలపై కర్రతో తీవ్రంగా కొట్టి రూ.22 వేలను దొంగిలించుకుపోయారు. లీ బాధితుడు సుమారు ఐదు రోజులపాటు అపస్మారకస్థితిలో ఉన్నాడు. అశోక్‌కుమర్‌ తన వీధిలోని కొబ్బిరెడ్డి రమణమ్మ ఇంటిని దోచుకునేందుకు పథకం వేశాడు. ఈ చోరీకి గ్యాంగ్‌ సభ్యులు పైలా మహేష్, డ్రైవర్స్‌ కాలనీకి చెందిన యాకదేవి సంపత్‌కుమార్, పెట్టా శివసాయి దత్తాలను ఉపయోగించాడు. అక్టోబర్‌ 14వ తేదీ ఉదయం నడకుదురు, వెలమపేట చివరన ఉన్న కొబ్బిరెడ్డి రమణమ్మ పశువుల పాక వద్ద ఉండగా,  నిందితులు ఆటోలో వచ్చి, ఆమె మెడలోని 7 కాసుల బంగారు ఆభరణాన్ని ఎత్తుకుపోయారు. కాకినాడ భానుగుడి సెంటర్‌లో నివాసం ఉంటోన్న కృష్ణ లాడ్జి యాజమాని కొప్పర్తి రమణమ్మ, ఆనంద్‌కృష్ణ వృద్ధులు.  ఆనంద్‌కృష్ణ  భానులింగేశ్వరస్వామి గుడికి వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న రమణమ్మ కాళ్లు, చేతులు కట్టేసి, నోటిలో గుడ్డలు కుక్కేసి సుమారు 35 కాసుల బంగారు ఆభరణాలు, రూ.60 వేలను దొంగిలించుకుపోయారు. ఇందుకు ప్రధాన సూత్రదారి కాలపురెడ్డి కృష్ణవేణి (ఆనంద్‌కృష్ణ సోదరుడు) కొప్పర్తి తిరుపతమ్మ ఇంట్లో సెప్టెంబర్‌ 19న జరిగిన దొంగతనంలో కీలక పాత్రధారి.
     
మరిన్ని వార్తలు