ఇది విరామం మాత్రమే!

1 Aug, 2016 17:45 IST|Sakshi
ఇది విరామం మాత్రమే!
  • సమ్మెకు సిద్ధంగా ఉండాలిl
  • ఎన్‌ఏడీ జంక్షన్‌: ఏడో వేతన సంఘం నిర్ణయాలపై అసంతృప్తితో సమ్మె చేసేందుకు రక్షణ శాఖ ఉద్యోగులు సిద్ధమయ్యారని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సమయం కోరడంతో సమ్మె వాయిదా వేశామని 7వ పే కమిషన్‌( వేతన సంఘం) అఖిల భారత కమిటీ సెక్రటరీ జనరల్, జేసీఎం నేషనల్‌ కౌన్సిల్‌ సభ్యుడు ఎం. కృష్ణన్‌ అన్నారు. అయితే ఇది విరామం మాత్రమే అని స్పష్టం చేశారు. ఎన్‌ఎస్‌టీఎల్‌ మానసి ఆడిటోరియంలో డిఫెన్స్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వర్క్స్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ సంయుక్తంగా ‘7వ వేతన సంఘం సిఫారసులపై ఐక్యపోరాటం– దాని ప్రభావం– ప్రభుత్వ వైఖరి’ అన్న అంశంపై ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ పే కమిషన్‌ ఏర్పాటును పోరాటాల ద్వారానే సాధించుకున్నామన్నారు. 7వ పే కమిషన్‌ సిఫారసుతో ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర స్థాయిలో అన్యాయం జరుగుతుందన్నారు. జస్టిస్‌ మాథూర్‌ సిఫారసులు సమర్పించడానికి ఒక నెల గడువు కోరగా.. ప్రభుత్వం నాలుగు నెలల సమయం ఇచ్చిందని, ఇది ప్రభుత్వ కుట్రలో భాగమే అని ఆరోపించారు. ఉద్యోగులకు రావాల్సిన 52 అలవెన్సు లు రద్దు చేశారని మండిపడ్డారు. హక్కుల సాధనకు సెప్టెం బర్‌ 2న చేపట్టబోయే సమ్మెకు ఉద్యోగులు, కార్మికులు, అసంఘటిత కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏఐడీఈఎఫ్‌ సంయుక్త కార్యదర్శి జీటీ గోపాలరావు మాట్లాడుతూ బీజేపీ కార్మిక వ్యతిరేకSప్రభుత్వమన్నారు. రక్షణ శాఖ ఉద్యోగులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తున్నారని, అందుకు ఉదాహరణే ఇటీవల ఎయిర్‌ఫోర్స్‌ విమానం గల్లంతు ఘటన అని గుర్తు చేశారు. సైనికులు ప్రాణాలకు తెగించి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, వారికి కనీసం రిస్క్‌ అలవెన్స్‌లు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటాల ద్వారానే ప్రభుత్వం దిగి వచ్చేలా చేయాలని పిలుపునిచ్చారు. గ్రేడ్‌ పే రూ.18వేలు నిర్ణయించడం దారుణమని, దీన్ని రూ.26 వేలు చేయాలని డిమాండ్‌ చేశారు.
     
     
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు