పోతిరెడ్డిపాడు వద్ద 880.80 అడుగుల నీటిమట్టం

28 Sep, 2016 00:36 IST|Sakshi
పోతిరెడ్డిపాడు వద్ద 880.80 అడుగుల నీటిమట్టం
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద మంగళవారం సాయంత్రం 7గంటల సమయంలో 880.80 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ విష్ణు తెలిపారు. శ్రీశైలం జలాశయంలోకి 1,20,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 881.80అడుగుల నీటిమట్టం వద్ద 197.20 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు గేజింగ్‌ అధికారులు తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 1500క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీకి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ వద్ద ఎస్సార్బీసీ, తెలుగుగంగ, కేసీ ఎస్కేప్‌ కాల్వకు 500 క్యూసెక్కుల ప్రకారం విడుదల చేస్తున్నట్లు  డీఈ శివరాంప్రసాద్‌ తెలిపారు. హంద్రీనీవాసుజలస్రవంతి కాల్వకు 2,025 క్యూసెక్కుల నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. విద్యుదుత్పత్తి అనంతరం  73,840 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 
 
మరిన్ని వార్తలు