95శాతం పుష్కర పనులు పూర్తి

6 Aug, 2016 18:25 IST|Sakshi
95శాతం పుష్కర పనులు పూర్తి
వాడపల్లి(దామరచర్ల): వాడపల్లి పుణ్యక్షేత్రంలో 95 శాతం మేర పుష్కర పనులు పూర్తయినట్లు పుష్కర ప్రత్యేక అధికారి ఏజేసీ వెంకట్రావ్‌ తెలిపారు. శనివారం వాడపల్లి శ్రీమీనాక్షి అగస్త్యేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మిగిలిన పనులన్నీ ఆదివారం పూర్తవుతాయన్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే 650 టాయ్‌లెట్లు పూర్తయ్యాయని,మరో 150 నిర్మాణంలో ఉన్నాయన్నారు. సురక్షిత తాగునీటి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. పుష్కరాలకు 450 మంది సివిల్‌ సిబ్బంది, 800 మంది పారిశుద్ధ్య కార్మికులు,150 మంది ఎలక్ట్రికల్‌ కార్మికులు,450 మంది వలంటీర్స్‌ మూడు షిప్టుల్లో పని చేస్తారన్నారు. ఏజేసీ మొదలుకొని స్వీపర్‌ వరకూ అక్షయ పాత్ర అందించే ఒకే రకమైన బోజనం తింటారన్నారు. వరదలు వచ్చినా సురక్షితంగా స్నానాలు చేసే విధంగా స్నానఘాట్ల వద్ద ఏర్పాట్లు చేస్తామన్నారు. 8 ఘాట్లవద్ద కంట్రోల్‌ రూమ్స్, ఒకచోట సెంట్రల్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. సమావేశంలో అధికారులు బాలకృష్ణ, యుగేందర్, శ్రీధర్, తహసీల్దార్‌ గణేష్, ఎంపీడీఓ ఉమాదేవి  పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు