రైస్‌మిల్లులో పేలిన బాయిలర్‌

3 Sep, 2016 22:40 IST|Sakshi
రైస్‌మిల్లులో పేలిన బాయిలర్‌

– ఇళ్ల గోడలు ధ్వంసం
–ఉలికిపడిన కాలనీవాసులు
మిర్యాలగూడ అర్బన్‌
 ప్రమాద వశాత్తు రైస్‌మిల్లులో బాయిలర్‌ పేలడంతో ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన పట్టణంలోని హనుమాన్‌పేటలో గల ఏకశిల పార్‌బాయిల్డ్‌ రైస్‌ మిల్లులో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. హునామన్‌ పేటలో గల ఏకశిల పార్‌బాయిల్డ్‌ రైస్‌మిల్లులోని బాయిలర్‌ రాత్రి 8:30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. దీంతో నాలుగు గదుల వెడల్పుతో ఉన్న బాయిలర్‌ మెత్తం ధ్వంసమైంది. పేలుడు శబ్దానికి ఇనుప ముక్కలు, రేకు ముక్కలు, ఇటుక పెల్లలు ఎగిరి ఇళ్లపై పడ్డాయి. దీంతో కాలనీవాసులు భయంతో పరుగులు పెట్టారు. పేలుడు శబ్దానికి  పలు ఇళ్లలో  టీవీలు పేలిపోయాయి. తేరుకున్న కాలనీ వాసులు రైస్‌మిల్లు వైపుకు వచ్చి చూడగా రైస్‌మిల్లు గోడలు కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో మిల్లులో పని చేసే కార్మికులు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైయింది.
గతంలోనూ..
కాగా బాయిలర్‌లో బూడిద పేరుక పోవడంతోనే బాయిలర్‌ పేలిందని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. రైస్‌మిల్లు వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ రైస్‌మిల్లులో గతంలోనూ ఇదే మాదిరిగా ప్రమాదం జరిగిందని అప్పుడుకూడా ఆస్తి నష్టం జరిగిందని  ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లు నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు.  

 

>
మరిన్ని వార్తలు