మూతపడనున్న వసతిగృహం

25 Jul, 2016 00:27 IST|Sakshi
మూతపడనున్న వసతిగృహం

విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని సాకు
ప్రవేశాలపై ప్రచారం  కరువు
ఏడాదిగా ఇన్‌చార్జీలతోనే నిర్వహణ
ఆందోళనలో విద్యార్థులు
మర్రిగూడ:  అధికారుల నిర్లక్ష్యంతో మర్రిగూడలో దళిత సంక్షేమ బాలుర  వసతిగృహం (ఎస్సీ) మూతపడనుంది. మండల కేంద్రంలో మూఫ్పై ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ హాస్టల్‌లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో మూసివేతకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పేద విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.
ఇన్‌చార్జీ పాలనలో ఇబ్బందులు
ఈ హాస్టల్‌లో పని చేసే వార్డన్‌ గత ఏడాది మార్చిలో పదవీ విరమణ పొందాడు. అప్పటి నుంచి దేవరకొండ వసతిగృహం  వార్డెన్‌ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతను వారంలో ఒకటి, రెండు రోజుల మాత్రమే ఇలా వచ్చి అలా పోవడంతో విద్యార్థులకు మౌలిక వసతులు అందడం లేదు. మోను ప్రకారం విద్యార్థులకు భోజనం అందడం లేదు. గత వారం రోజుల నుంచిlఉదయం అల్పహారంగా ఇచ్చే జావా కూడ ఇవ్వడం లేదు. అరటిపండ్లు అందడం లేదు. గతంలో వందల మంది ఉన్న ఈ హాస్టల్‌లో వసతులు లోపించడం.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో అస్తవ్యస్తంగా మారింది. దీనికితోడు ఈయేడు బాడిబాట కార్యక్రమంలో విద్యార్థులను వసతిగృహంలో చేర్పించడంతో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఈ విద్యాసంవత్సరం విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
ఆందోళనలో విద్యార్థులు
lచింతపల్లి, నాంపల్లి, మర్రిగూడ తదితర మండలాల్లోని వివిధ గ్రామాల నుంచిl30 మంది విద్యార్థులు ఈ వసతిగృహంలో ఉంటు విద్యనభ్యాసిస్తున్నారు. అయితే ఇప్పుడు అర్థాంతరంగా హాస్టల్‌ మూసివేస్తామని అధికారులు చెబుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.  ప్రస్తుతం ఉన్న ఇన్‌చార్జ్‌ వార్డెన్‌ కూడా సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు మూసివేయాలని నివేధిక అందించాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఎటూకానీ సమసయంలో తాము వసతి కోసం ఎక్కడికి వెళ్లాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
హాస్టల్‌ను మూసేస్తే ఊరుకోం
–సిలివేరు విష్ణు, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకుడు
బాడిబాట కార్యక్రమంలో విద్యార్థులను చేర్చుకోకుండా ఇప్పుడు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని హాస్టల్‌ను మూసివేస్తామనడం అధికారులకు సబబు కాదు. హాస్టల్‌ను తొలగిస్తే పేద విద్యార్థులు ఎలా చదువుకుంటారు. అధికారులు మెండిగా వ్యవహరిస్తే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకోని ఆందోళనలు చేస్తాం.
విచారణ చేస్తాం
బాలసింగ్, ఏఎస్‌డబ్ల్యూ
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున వసతి గృహాన్ని ఎత్తివేయాలి అనుకుంటున్నాం. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య పెంచడానికి కృషి చేస్తు్తన్నాం. సంఖ్య పెరగని పక్షంలో ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాం.

 

మరిన్ని వార్తలు