ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ ఉద్యోగి

19 Jun, 2017 22:52 IST|Sakshi
ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ ఉద్యోగి
కదిరి : కదిరి మున్సిపల్‌ కార్యాలయ అకౌంటెంట్‌ నారాయణప్ప సోమవారం రూ.8 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబట్టాడు. ఏసీబీ డీఎస్పీ జయరామరాజు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. జయప్రకాష్‌ కదిరి మున్సిపాలిటీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ 2014లో ఉద్యోగ విరమణ చేశారు. ఈయన భార్య రామాంజులమ్మకు సంబంధించి రూ.30 వేల మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు రావాల్సి ఉంది. చాలా రోజులుగా ఆ కార్యాలయ అకౌంటెంట్‌ నారాయణప్ప చుట్టూ తిరిగి విసిగిపోయాడు. చివరకు తనకు రూ.10 వేలు ముట్టజెబితే కానీ ఆ బిల్లు ఇచ్చేది లేదని అకౌంటెంట్‌ తేల్చి చెప్పాడు. తనకు అంత స్తోమత లేదని ప్రా«ధేయపడినా కనికరం చూపలేదు. చివరకు జయప్రకాష్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించి తన గోడు వెల్లబోసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ జయరామరాజు, సీఐలు ఖాదర్‌బాషా, ప్రతాప్‌రెడ్డి, చక్రవర్తి రంగంలోకి దిగారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బాధితుడు జయప్రకాష్‌.. అకౌంటెంట్‌ నారాయణప్పకు రూ.8 వేలు లంచం ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పంచనామా అనంతరం నారాయణప్పను కర్నూలుకు తరలించారు.  
మరిన్ని వార్తలు