పాత కక్షల నేపథ్యంలో వ్యక్తి దారుణ హత్య

12 Feb, 2017 20:59 IST|Sakshi
పాత కక్షల నేపథ్యంలో వ్యక్తి దారుణ హత్య
 
 
దైద (గురజాల రూరల్‌) : పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన మండలంలోని దైద గ్రామ ఎస్సీ కాలనీలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం...జయబాబు ఎస్సీ కాలనీలో నివాసముంటూ, కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం గ్రామంలోని లూథరన్‌ చర్చికి ప్రార్థనకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో గాడిదల వాగు వద్ద ఆర్‌అండ్‌బీ రహదారిపై మాటు వేసిన దుండగులు దారుణంగా గొడ్డళ్లతో తలపై నరికి, కత్తులతో గొంతు కోయడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గురజాల ఇన్‌చార్జీ సీఐ ఆళహరి శ్రీనివాసరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్యా,  నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 
 
 
మరిన్ని వార్తలు