జిల్లాకు ఏసీ బస్సులు

28 Oct, 2016 01:23 IST|Sakshi
బనగానపల్లె :
జిల్లా నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రధాన రూట్లల్లో ప్రయాణీకుల సౌకర్యార్థం   ఏసీ బస్సు సర్వీసులు నడుపుతామని ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ వెంకటేశ్వరరావు తెలిపారు. బనగానపల్లె డిపో ప్రాంగణంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌–బెంగళూరు, కర్నూలు– బెంగళూరు, నంద్యాల– బెంగళూరు, డోన్‌– విజయవాడ, శ్రీశైలం– బెంగళూరు సర్వీసులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతిరాగానే ఏసీ బస్సులు నడుపుతామన్నారు. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ చివరి వరకు జిల్లాలో ఆర్టీసీకి రూ.45కోట్ల నష్టం వచ్చిందన్నారు. ఇందులో బనగానపల్లె డిపో నష్టం రూ.4.5కోట్ల వరకు ఉందన్నారు. స్థానిక ఆర్టీసీ డిపోకు 3 కొత్త బస్సులు పంపామని, మరిన్ని బస్సులను కూడా పంపుతామని తెలిపారు. అంతకుముందు ఆర్‌ఎం డిపో మేనేజర్‌ శశిభూషణ్‌తో కలిసి బస్టాండ్‌ ప్రాంగణంలో నిర్మిస్తున్న దుకాణాల సముదాయం, బస్టాండ్‌లో వసతులను పరిశీలించారు. గ్యారేజి ప్రాంగణంలో మొక్కలు నాటారు. 
 
మరిన్ని వార్తలు