రాజంపేట ఎంవీఐ కార్యాలయంపై ఏసీబీ దాడులు

21 Oct, 2016 00:21 IST|Sakshi

రాజంపేట: రాజంపేట ఎంవీఐ కార్యాలయంపై కడప ఏసీబీ అధికారులు గురువారం దాడులు చేశారు. ఈ దాడిలో నలుగురు ఏజెంట్ల దగ్గర నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ నాగరాజు విలేకర్లతో మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు రాజంపేట ఎంవీఐ కార్యాలయంపై దాడులు చేశామన్నారు.  కార్యాలయం వద్ద ఉన్న నలుగురు ఏజెంట్లను పట్టుకున్నామని తెలిపారు. వారి దగ్గర నుంచి రూ.32వేల డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లైసెన్సు, రెన్యూవల్స్, ఎల్‌ఎల్‌ఆర్‌ తదితర వాటి కోసం వచ్చేవారు ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఏజెంట్ల ద్వారా రవాణాశాఖకు సంబంధించి ఎటువంటి పనులు చేయరాదనే నిబంధన ఉందన్నారు. ఆ నిబంధనలు ఉల్లఘించిన ఏజెంట్లు డబ్బులు అక్రమంగా రాబడుతున్నారని తెలిపారు. దీనిపై పూర్తిస్ధాయిలో విచారణ చేస్తామన్నారు. అధికారులు ఎవరైన డబ్బులు ఇస్తేనే తమ పనులు చేసి పెడతామని చెపితే అలాంటి వివరాలను తమకు అందచేస్తే తమ స్థాయిలో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి సమాచారం ఉంటే 9440446191 నెంబరుకు సంప్రందించాలన్నారు. కాగా ఎసీబీ అధికారుల బృందం సాయంత్రం వరకు ఎంవీఐ కార్యాలయంలో మకాం వేశారు.
 

మరిన్ని వార్తలు