భూఅక్రమాలపై ఏసీబీ కన్ను

15 Jun, 2017 11:52 IST|Sakshi
భూఅక్రమాలపై ఏసీబీ కన్ను

► రాజంపేటలో జోరుగా భూ అక్రమాలు
► రికార్డుల కోసం వచ్చిన అధికారులు
► క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లపై ఆరా
► కాసులు కురిపిస్తున్న భూ వ్యవహారాలు
► కోట్లాది విలువచేసే సర్కారు భూములు ధారాదత్తం  


రాజంపేట: రాజంపేట రెవెన్యూ డివిజన్‌ పరిధిలోజరిగిన భూ అక్రమాలపై ఎసీబీ కన్నుపడింది. మండల పరిధిలో రూ.కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. రికార్డుల టాంపరింగ్, కబ్జాలు ఇలా ఎన్ని అడ్డదారులు ఉన్నాయో అన్ని అడ్డదారుల్లో భూ బకాసురులు అక్రమ వ్యవహారాలకు తెరతీశారు. రికార్డులు తారుమారు, టాంపరింగ్‌ చేసి తమవి అన్నట్లుగా చిత్రీకరించుకోవడం రాజంపేటలో అధికం కావడంతో నిజమైన భూబాధితులు అధికారుల అవినీతికి అడ్డుకట్టవేసేందుకు ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. ఈనేపథ్యంలోనే ఏసీబీ అధికారులు మంగళవారం తహసీల్దారు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలను సందర్శించారు. అక్కడి అధికారులతో భేటీ అయినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ స్థలాలను కట్టబెట్టి...కోట్లు లాభర్జన:
తహసీల్దారు కార్యాలయంలో కొందరు ప్రభుత్వ స్థలాలను అడ్డగోలుగా భూ బకాసురులకు కట్టబెడుతున్నారు. ఇందుకు కొంతమంది అధికారులు ఇప్పటికే కోట్లాది రూపాయలు వెనుకేసుకున్నట్లుగా ఆరోపణలు వెలుడుతున్నాయి. ఓ రెవెన్యూ అధికారి బాధ్యతలు తీసుకున్నప్పటి నుం చి కోట్లాది రూపాయలు భూ కుం భకోణంకు పాల్పడినట్లుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినప్పటికి ఏమీ చేయలేని నిస్సహాయíస్థితిలో రెవెన్యూ ఉన్నతాధికారులు ఉండిపోయారు. అధికార పార్టీ అండదండలతో భూ అక్రమ వ్యవహారాలను తమ్ముళ్లకు అనుకూలంగా వ్యవహారిస్తూ రూ.కోట్లు వెనుకవేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు వీఆర్వోలు కూడా భూ బకాసురు లకు అంతర్గత మద్దత్తు ఇస్తూ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నారు.

ఏసీబీ ఆరాతో రెవెన్యూ అధికారుల్లో వణుకు
ఏసీబీ అధికారులు తహసీల్దారు కార్యాలయానికి రావడంతో కొందరు అధికారుల్లో  వణుకుపుట్టింది. అలాగే ప్రభుత్వ భూములను కూడా రికార్డులు మార్చేసి రాజం పేట రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో రిజిష్టర్లు కూడా చేయించుకున్నారంటే ఎంత పక్కాగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ అధికారులు సహకారం లేకుంటే ఇది సాధ్యమయ్యే పని కాదని భూ బాధితులు చెబుతున్నారు. తాళ్లపాక, ఊటుకూరు, వెంకటరాజంపే ట, బోయనపల్లె, అన్నమయ్య థీం పార్కు ఏరియా, బైపాస్‌ రహదారి, చక్రాలమడుగు ఏరియా, ఎస్‌ఆర్‌పాళెం(పుల్లంపేట మండలం), రాయచోటి రోడ్డు తదితర ప్రాంతాల్లో భూ అక్రమ వ్యవహారాలు కోట్లరూపాయలు సాగినట్లుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా యి. పైవాటిలో కొన్నింటికి సంబంధించి భూ రికార్డులలో గోల్‌మాల్‌ చేసినట్లు ఏసీబీ దృష్టికి వెళ్లినట్లు సమాచారం.

ఇంటిస్థలం లేని వారికి ప్రభుత్వ స్థలం ఎక్కడాలేదనే రాజంపేట రెవెన్యూ అధికారులు మాత్రం బడాబాబులు, అధికారపార్టీ నేతలకు మాత్రం దగ్గరుండి సాగు, ఇంటి స్థలాలను చూపించి.. వారి వద్ద నుంచి కొంత మొత్తం తీసుకొని కట్టబెడుతున్నారు. గత మూడేళ్లుగా కొనసాగిన ప్రభుత్వ భూ అక్రమ వ్యవహారం ఎట్టకేలకు ఏసీబీని కూడా తాకింది...ఏసీబీ అధికారులు ఏ క్షణానైనా దాడి చేయవచ్చనే భయాందోళన రెవెన్యూ వర్గాల్లో హాట్‌టాఫిక్‌గా మారింది.

రికార్డుల కోసం..
ఏసీబీ అధికారులు మండల రెవెన్యూ కార్యాలయాల్లో రికార్డుల కోసం ఆయాశాఖల అధికారులను సంప్రందించినట్లు సమాచారం. ఏసీబీ అధికారులు గత కొంతకాలంగా రాజంపేటలో జరుగుతున్న భూ అక్రమ వ్యవహారాలపై నిఘా ఉం చారు.  టీడీపీ అధికారంలోకి వచ్చాక భూ అక్రమ వ్యవహా రాలు అధికమయ్యాయి. ప్రభుత్వ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించడం లాంటివి స్థానిక రెవెన్యూ అధి కారుల సహకారంతో చేపట్టినట్లు ఆరోపణలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. ప్ర«భుత్వ భూములను తమవి అన్నట్లుగా రికార్డులు సృష్టించుకొని అందులో రియల్‌ వ్యాపారం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు