చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి

10 Jan, 2017 01:44 IST|Sakshi
చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి
జీలుగుమిల్లి : రాష్ట్ర సరిహద్దు తాటియాకులగూడెంలోని రవాణా శాఖ చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు సోమవారం తెల్లవారుజామున ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ సమయంలో చెక్‌ పోస్టులో ఇద్దరు అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు, ఒక కంప్యూటర్‌ ఆపరేటర్, సిబ్బంది ఉన్నారు. ఓ అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ విశ్రాంతిలో ఉండగా.. మరొకరు విధులు నిర్వహిస్తున్నారు.   చెక్‌ పోస్టు సిబ్బంది బయటకు వెళ్లకుండా చుట్టూ ఏసీబీ సిబ్బంది కాపాలాకాశారు. చెక్‌ పోస్టు సిబ్బంది వద్ద ఉన్న నగదు, క్యాష్‌ కౌంటర్‌లోని నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కౌంటర్‌ కంప్యూటర్‌లోని పనున్న చెల్లింపు  వివరాలు ప్రింట్‌ అవుట్లు తీసుకున్నారు. లెక్కల్లో లేని రూ.4,500ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపారు. తనిఖీల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ వి.జె.విల్సన్‌  తదితరులు ఉన్నారు. 
తరచూ ఆరోపణలు : 2014లో ప్రారం భించిన ఈ రవాణా శాఖ చెక్‌ పోస్టుపై ఏసీబీ దాడులు జరగడం ఇది మూడోసారి. ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని తరచూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  
 
>
మరిన్ని వార్తలు