మోహన్రావు ఇంట్లో రెండో రోజు కొనసాగుతున్న సోదాలు

29 Apr, 2016 10:25 IST|Sakshi

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రవాణా ఉప కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న మోహన్రావు ఇంటిపై ఏసీబీ దాడులు శుక్రవారం రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ. 50 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని మోహన్రావు బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. కాగా మోహన్ రావు ఇంటి నుంచి 2.5 కేజీల బంగారంతోపాటు 5.5 కేజీల వెండిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు.

అలాగే సొదాల్లో భాగంగా మోహన్రావు కుమార్తె పేరు మీద 9 ఎకరాలు, 6 బినామీ కంపెనీలను అధికారులు గుర్తించారు. హైదరాబాద్లోని కొంపల్లి, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, మాదాపూర్లో మోహన్రావు భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు కనుగొన్నారు. మోహన్రావును నేడు ఏసీబీ కోర్టు కు తరలించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు డీటీసీ మోహన్ రావుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ గురువారం దాడి చేసింది.

మరిన్ని వార్తలు