డీఎడ్‌ కాలేజీలో ఏసీబీ తనిఖీ

4 Aug, 2016 23:39 IST|Sakshi
డీఎడ్‌ కాలేజీలో ఏసీబీ తనిఖీ
ఆత్రేయపురం:
స్థానిక డీఎడ్‌ కాలేజీలో గురువారం ఏసీబీ సీఐ బి. రాజశేఖర్‌ ఆధ్వర్యంలో అధికారుల బృందం దాడులు నిర్వహించింది. రాష్ట్రంలో డీఎడ్‌ కాలేజీల రెన్యువల్‌లో భాగంగా హైదరాబాద్‌ ఎస్‌ఎస్‌సీ బోర్డు కార్యాలయం వద్ద ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు డైరెక్టర్‌ ప్రసన్నకుమార్‌ ఒకొక్క విద్యార్థి నుంచి రూ. వెయ్యి చొప్పున వసూలు చేస్తూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆ వసూళ్లలో భాగస్వాములైన డీఎడ్‌ విద్యాసంస్థల అధినేత వినుకొండకు చెందిన రఫీ, రామారావును ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. ఈ దాడుల్లో రూ. 44.65 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. డీఎడ్‌ విద్యా సంస్థల అధినేత రఫీ రాష్ట్రవ్యాప్తంగా 23 డీఎడ్‌ కాలేజీల్లో భాగస్వామి కావడంతో ఆయా కాలేజీలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఆ నేపథ్యంలో ఆత్రేయపురంలోని డీఎడ్‌ కాలేజీపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కాలేజీ రికార్డులను ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అదే సమయంలో సంస్థ డైరెక్టర్‌ పీఎస్‌ రాజు ఇంటిలో కూడా ఏసీబీ బృందం దాడులు నిర్వహించింది. ఏసీబీ సీఐ రాజశేఖర్‌ మాట్లాడుతూ  కాలేజీ రికార్డులను పరిశీలించామని, దీనికి సంబంధించిన నివేదికను ఏసీబీ ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. అంబాజీపేట ఎంపీడీఓ టి.S శ్రీనివాస విశ్వనాథ్, ఏసీబీ సిబ్బంది ఎస్‌వై జానీ, బి. లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు