అదిగో దయ్యాల మలుపు..!

25 Mar, 2016 04:55 IST|Sakshi
అదిగో దయ్యాల మలుపు..!

పెద్ద దోర్నాల మండలంలో భారీగా ప్రమాదాలు
మూడు నెలల్లో అనంత వాయువుల్లో కలిసిన 9 మంది ప్రాణాలు


ప్రయాణం ఎక్కడ ప్రారంభమైనా.. సమయం ఏదైనా.. ముహూర్తం ఎలాగున్నా.. పెద్దదోర్నాల మండలంలోకి ప్రవేశించాక ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది.. దయ్యూల మలుపు సమీపిస్తే స్టీరింగ్ అదుపు తప్పుతుంది జస్ట్ మూడు నెలలల్లో 9 మంది పరలోకాలకు వెళ్లారు 8 మంది మృత్యువును అతి దగ్గరగా చూసొచ్చారు పదుల కొద్దీ మూగజీవాలు బలయ్యూరుు..  ఈ మండలంలో ఏం జరుగుతోంది..? -పెద్దదోర్నాల

 పెద్దదోర్నాల మండలం పేరు వింటేనే వాహనదారులు హడలెత్తిపోతున్నారు. వరుసగా జరుగుతున్న ప్రమాదాల్లో ప్రాణాలు పోతుండటంతో ఆయూ మార్గాల్లో వెళ్లేందుకు జంకుతున్నారు. మండల పరిధిలోని కర్నూల్-గుంటూర్ రోడ్డుతో పాటు శ్రీశైలం ఘాట్ రోడ్లు (దయ్యూల మలుపు) ఘోర ప్రమాదాలకు నిలయంగా మారారుు. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాల నివారణ అసాధ్యంగా మారింది. అలాగే అధిక వేగం, నిద్రలేమి, అనుభవరాహిత్యంతో పాటు మద్యం మత్తు, ఆందోళన వంటివి ప్రతికూల అంశాలుగా మారారుు.  జనవరి నుండి ఇప్పటి వరకు 3 నెలల కాలంలో 9 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 9 మంది మృత్యువాత పడ్డారు. మరో 8 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.

     ఇలా..
కర్నూలు- గుంటూరు రోడ్డులోని గంటవానిపల్లి వద్ద జనవరిలో 21న లారీ ఢీకొన్న సంఘటనలో మహిళ మృతి చెందగా, అదే నెల 29న శ్రీశైలం రోడ్డులోని అయ్యప్ప స్వామిగుడి వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందారు.
ఇదే నెల 31న జమ్మిదోర్నాల వద్ద ఓ వాహనం ఢీ కొని మహిళ మృతి చెందింది.
ఫిబ్రవరి 12న వెలుగొండ ప్రాజెక్టు వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మార్చి 2న జమ్మిదోర్నాల వద్ద లారీ, డీసీఎంలు ఢీకొనడంతో డీసీఎం క్లీనర్ మృతి చెందాడు.
ఇదే నెల 5వ తేదీన శ్రీశైలం ఘాట్ రోడ్‌లోని తుమ్మలబైలు వద్ద బైక్‌ను ఆర్టీసీ బస్ ఢీకొన్న ప్రమాదంలో కర్నూల్ జిల్లాకు చెందిన యువకుడు దుర్మరణం పాలయ్యాడు.
ఫిబ్రవరి 11న చిన్నగుడిపాడు వద్ద ఇన్నోవా కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న ప్రమాదంలో కృష్ణా జిల్లా గుడివాడ తహసీల్దార్ తల్లి మృత్యువాత పడగా మరో ముగ్గురు తీవ్రంగా గాయాల పాలయ్యారు.
17న శ్రీశైలం ఘాట్ రోడ్‌లోని దయ్యాల మలుపులో సిమెంటు లారీ లోయలోకి దూసుకు పోయిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కర్నూల్ రోడ్డులోని రోళ్లపెంట వద్ద మంగళవారం రాత్రి ఓ కార్గో లారీ బోల్తా పడటంతో 20 ఆవులు మృతి చెందగా, మరో ఆరు ఆవులు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి.

నివారణ సాధ్యం కాదా?
♦  అత్యంత దారుణంగా జరుగుతున్న సంఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతున్నారుు.
ద్విచక్రవాహణదారులు  లెసైన్సులు లేకుండా ప్రయాణిస్తున్నారు. అలాంటి వారిపై ఆర్‌టీఏ, పోలీస్ శాఖాధికారులు తనిఖీలు నిర్వహించాలి. అనుమతి, ధ్రువీకరణ పత్రాలు లేకుండా వాహనాన్ని నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలి.
♦  ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి.
మద్యం సేవించి వాహనాన్ని నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మితిమీరిన వేగంతో వాహనాన్ని నడిపే వారిని గుర్తించి భారీగా జరిమానాలను విధించాలి.
హెచ్చరిక బోర్డులు.. ఏర్పాటు చేయూలి. డ్రైవింగ్‌పై అవగాహన సదస్సులు కల్పించాలి.

మరిన్ని వార్తలు