బ్యాంకుకు తాళాలు వేసి ఖాతాదారుల నిరసన

12 Dec, 2016 15:24 IST|Sakshi
బ్యాంకుకు తాళాలు వేసి ఖాతాదారుల నిరసన
 
ఈపూరు : పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులు చివరికి నడిరోడ్డుపై ధర్నాకు దిగారు. గుంటూరు జిల్లాలో మండల కేంద్రమైన ఈపూరులో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈపూరు ఆంధ్రాబ్యాంకులో నగదు తీసుకునేందుకు వివిధ గ్రామాల నుంచి ఖాతాదారులు సోమవారం భారీగా తరలి వచ్చారు. అయితే బ్యాంకులో నగదు లేదని అధికారులు చెప్పడంతో ఆగ్రహించిన వారు అధికారులను బయటకు తీసుకొచ్చి బ్యాంకుకు తాళాలు వేసి నిరసన తెలిపారు. అనంతరం వినుకొండ–కారంపూడి నడిరోడ్డుపై బైఠాయించి ఆంధ్రాబ్యాంకు సిబ్బంది పనితీరుకు నిరసనగా ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆందోâýæనకారులు మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు నిర్ణయం వలన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎక్కడకు వెళ్లినా నోట్లు మారక నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్యాంకుల్లో చేసే డిపాజిట్లకు సరిపడా కొత్త నోట్లు అందించాలని వారు కోరారు. అనంతరం పోలీసుల జోక్యంతో ధర్నాను విరమింపజేశారు.బ్యాంకుకు తాళాలు వేసి ఖాతాదారుల నిరసన    
బ్యాంకుకు తాళాలు వేసి ఖాతాదారుల నిరసన    
బ్యాంకుకు తాళాలు వేసి ఖాతాదారుల నిరసన    
 
ఈపూరు : పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులు చివరికి నడిరోడ్డుపై ధర్నాకు దిగారు. గుంటూరు జిల్లాలో మండల కేంద్రమైన ఈపూరులో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈపూరు ఆంధ్రాబ్యాంకులో నగదు తీసుకునేందుకు వివిధ గ్రామాల నుంచి ఖాతాదారులు సోమవారం భారీగా తరలి వచ్చారు. అయితే బ్యాంకులో నగదు లేదని అధికారులు చెప్పడంతో ఆగ్రహించిన వారు అధికారులను బయటకు తీసుకొచ్చి బ్యాంకుకు తాళాలు వేసి నిరసన తెలిపారు. అనంతరం వినుకొండ–కారంపూడి నడిరోడ్డుపై బైఠాయించి ఆంధ్రాబ్యాంకు సిబ్బంది పనితీరుకు నిరసనగా ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆందోâýæనకారులు మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు నిర్ణయం వలన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎక్కడకు వెళ్లినా నోట్లు మారక నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్యాంకుల్లో చేసే డిపాజిట్లకు సరిపడా కొత్త నోట్లు అందించాలని వారు కోరారు. అనంతరం పోలీసుల జోక్యంతో ధర్నాను విరమింపజేశారు.
 
>
మరిన్ని వార్తలు