డీలర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలు

18 Nov, 2016 03:02 IST|Sakshi
డీలర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలు

జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీకాంత్‌రెడ్డి
గుడిహత్నూర్ : రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరుకులు దుర్వినియోగానికి గురైతే వేటు తప్పదని హెచ్చరించారు. డీలర్లు కాకుండా ఇతరులు దుకాణం నడిపించడానికి వీలు లేదని, అలా జరిగితే లెసైన్స్ రద్దు చేసి దుకాణం మూరుుస్తామని పేర్కొన్నారు. సకాలంలో సరుకులు అందుబాటులో ఉంచి అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్‌ఫోర్సమెంట్ డీటీ రాజ్‌మోహన్, డిప్యూటీ తహసీల్దార్ నలంద ప్రియ, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు