700 హెక్టార్ల డ్రిప్‌నకు చర్యలు

6 Oct, 2016 23:19 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌ : వచ్చే రెండు రోజుల్లో కనీసం 700 హెక్టార్లకు డ్రిప్‌ మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఏపీడీ ఆర్‌.విజయశంకరరెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం నగరంలోని ఏపీఎంఐపీ కార్యాలయంలో ఇరిగేషన్‌ కంపెనీ డీసీవోలతో సమావేశం నిర్వహించారు.

జిల్లాకు కేటాయించిన 35 వేల హెక్టార్ల లక్ష్యంలో ఇప్పటివరకు 7,271 హెక్టార్లకు రైతులకు యూనిట్లు మంజూరు చేశామన్నారు. ఈ రెండు రోజుల్లో మరో 700 హెక్టార్లకు ఇస్తామన్నారు. రక్షకతడి కోసం సరఫరా చేసిన రెయిన్‌గన్లు, స్ప్రింక్లర్లు, హెచ్‌డీ పైపులను రైతుల నుంచి తిరిగి వెనక్కితీసుకునేందుకు కంపెనీ డీలర్లు,  క్షేత్రస్థాయి సిబ్బంది సహకరించాలని సూచించారు. 

>
మరిన్ని వార్తలు