ఎన్నాళ్లీ.. దుర్గంధం !

4 Jul, 2017 04:39 IST|Sakshi
ఎన్నాళ్లీ.. దుర్గంధం !

అపరిశుభ్రంగా ఏడీఏ కార్యాలయం
స్వచ్ఛత మరచిన అధికారులు
మురుగు, పిచ్చిమొక్కలను తొలగించాలని సిబ్బంది వేడుకోలు

సూర్యాపేట వ్యవసాయం : స్వచ్ఛభారత్‌ కార్యక్రమం ద్వారా ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా మారుతు న్నా.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల వ్యవసాయ డివిజన్‌ కార్యాలయం మాత్రం అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది. ఈ కార్యాలయంలో ఏడీఏతోపాటు ఏఓ విధులు నిర్వహిస్తుంటారు. వీరికోసం ప్రతిరో జూ రైతులు వచ్చిపోతుంటారు. కానీ వ్యవసాయం కార్యాలయ ఆవరణలో పిచ్చి మొక్కలు మొలిచి కనిపిస్తోంది.

దీనికితోడు కార్యాలయం ప్రవేశద్వారం ముందు లోపల గోడ పక్కనే ముగురునీరు నిలిచి ఉండడంతో దుర్వాసన వస్తోంది. ఫలితంగా ముక్కు మూసుకుని కార్యాలయంలోనికి వెళ్లాల్సిన పరిస్ధితి నెలకొందని కార్యాలయానికి వచ్చే రైతాంగంతో పాటు సిబ్బంది పేర్కొం టున్నారు. వర్షాకాలం కావడంతో పాములు ఇతర క్రిమికీటకాలు వచ్చే ప్రమాదముందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయం ఆవరణలోని పిచ్చిమొక్కలను తొలగించి నీడనిచ్చే చెట్లను నాటి, మురికి నీరు కార్యాలయంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు.   

మున్సిపాలిటీ వారికి చెప్పాం..
కార్యాలయం ముందు భాగంలో ఉన్న మురికి కాల్వ గుండా నీరు సరిగ్గా పోకపోవడంతో నిత్యం నిల్వ ఉంటోంది. దీంతో దుర్గంధం వ్యాపిస్తోంది, మురికి కాల్వలో చెత్తాచెదారం తొలగించి మురుగు పోయేలా చూడాలి. ఈ విషయాన్ని ఎన్నోసార్లు మున్సిపల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కానీ వారు పట్టించుకోవడంలేదు. మరోసారి వారికి తెలియపరుస్తాం.
 – శంక్‌ర్‌రాథోడ్,  ఏడీఏ సూర్యాపేట

>
మరిన్ని వార్తలు