ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు తాత్కాలికంగా అదనపు బోగీలు

6 Jan, 2017 19:44 IST|Sakshi

సాక్షి, అమరావతి: వెయిటింగ్‌ జాబితాలో ఉన్న ప్రయాణికుల కోసం 14 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఈ నెలాఖరు వరకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే  ప్రకటించింది.

నాందేడ్‌–ముంబయి సీఎస్‌టీ తపోవన్‌ ఎక్స్‌ప్రెస్, ముంబయి సీఎస్‌టీ–నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్, గుంటూరు–వికారాబాద్, వికారాబాద్‌–గుంటూరు, హైదరాబాద్‌–నర్సాపూర్, నర్సాపూర్‌–హైదరాబాద్, హైదరాబాద్‌–త్రివేండ్రం శబరి ఎక్స్‌ప్రెస్, త్రివేండ్రం–హైదరాబాద్‌ శబరి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌–విజయవాడ ఇంటర్‌ సిటీ, విజయవాడ–సికింద్రాబాద్‌ ఇంటర్‌ సిటీ, సికింద్రాబాద్‌–విశాఖపట్నం గరీబ్‌ర«థ్‌ ఎక్స్‌ప్రెస్‌లకు అదనపు ఏసీ బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు సీపీఆర్వో ఉమాశంకర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు