అదనపు బాధ్యతల తొలగింపు

28 Sep, 2016 23:32 IST|Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌ : డిప్యూటీ డీఈఓ అదనపు బాధ్యతల నుంచి విద్యాశాఖ ఏడీ చంద్రలీలను తప్పించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖకు పాఠశాల విద్యా కమిషనర్‌ నుంచి బుధవారం ఉత్తర్వులు అందాయి. ఈ విషయం విద్యాశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చంద్రలీల మధ్యాహ్న భోజన పథకం (ఎండీఎం) అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈమెకు ధర్మవరం డివిజన్‌ డిప్యూటీ డీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే తాడిపత్రి మోడల్‌ స్కూల్‌లో 2014 నుంచి 2016 వరకు దాదాపు రెండేళ్లపాటు మధ్యాహ్న భోజన పథకం అమలు కాలేదని తెలిసింది.

ఈ విషయంలో కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులకు విచారణకు ఆదేశించారు.  వారి నివేదిక ఆధారంగా అదనపు బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయించారు. దీనిపై డీఈఓ అంజయ్యను వివరణ కోరగా డిప్యూటీ డీఈఓ అదనపు బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు వచ్చింది వాస్తవమన్నారు. 

మరిన్ని వార్తలు