ఆ స్థలం ఎవరిది?

13 Dec, 2016 23:19 IST|Sakshi
ఆ స్థలం ఎవరిది?
  • ఆదెమ్మదిబ్బ స్థలంS వ్యవహారంలో మరో మెలిక  
  • ఆ స్థలం కందుల వీరరాఘవ స్వామిదంటూ ప్రచారం
  • వారసుల వద్ద డాక్యుమెంట్లు  ∙  
  • కోర్టుల్లో నడుస్తున్న కేసులు
  • సత్యవోలు శేషగిరిరావు వద్ద కొనుగోలు చేశానని చెబుతున్న అక్రమణదారులు స్థలాన్ని పరిశీలించిన నగరపాలక సంస్థ అధికారులు
  • సాక్షి, రాజమహేంద్రవరం :
    రాజమహేంద్రవరం నడిబొడ్డన రూ.100 కోట్ల విలువైన 3.54 ఎకరాల ఆదెమ్మ దిబ్బ స్థలం వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆ స్థలం రాజ మహేంద్రవరం మాజీ మున్సిపల్‌ చైర్మ¯ŒS కందుల వీరరాఘవ స్వామిదని (కేవీఆర్‌ స్వామి) నగరంలో ప్రచారం జరుగుతోంది. ఆయన వారసులు ప్రస్తుతం దివా¯ŒS చెరువులో నివాసముంటున్నారని సమాచారం. కందుల వీర రాఘవ స్వామి రాజమహేంద్రవరం నగరం, చుట్టుపక్కల అనేక ఎకరాల పొలాలు, విలువైన స్థలాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆదెమ్మ దిబ్బ స్థలం. మద్రాసు ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీగా, రాజమహేంద్రవరం మాజీ మున్సిపల్‌ చైర్మ¯ŒSగా పని చేసిన కేవీఆర్‌ స్వామి గొప్ప దాత, సంఘ సంస్కర్తగా పేరుంది. మహాత్మాగాంధీతో లండ¯ŒSలో బారిస్టర్‌ చదివిన కేవీఆర్‌ స్వామి తన ఆస్తులలో చాలా భాగం ప్రభుత్వ అవసరాలకు, పేదలకు పంచిపెట్టారు. అందులో భాగంగా ఆదెమ్మ దిబ్బ ప్రాంతంలోని 3.54 ఎకరాలను అప్పట్లో మున్సిపల్‌ పాఠశాల, ఇతర ప్రభుత్వ అవసరాలకు ఇచ్చినట్లుగా సమాచారం. ప్రభుత్వం ఆ స్థలంలోని కొంత భాగంలో వాంబే గృహాలు, నగరపాలక సంస్థ పాఠశాలను నిర్మించింది. మిగతా స్థలం ఖాళీగా ఉండడంతో అప్పట్లో ఇళ్లులేని పేదలు గుడిసెలు వేసుకుని నివíసిస్తున్నారు. ఓ వైపు కొంత మంది పక్కా భవనాలు నిర్మించుకున్నారు.. ప్రభుత్వ అవసరాలకు స్థలాన్ని వినియోగించకపోవడంతో ఆ స్థలాన్ని అప్పగించాలని కేవీఆర్‌ స్వామి ముని మనవడు, రాజానగరం మాజీ జెడ్పీటీసీ కందుల పద్మావతి తనయుడు కందుల బాబూరాయుడు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ఐదేళ్ల క్రితం రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం అధికారులు చర్యలు కూడా చేపట్టారని తెలిసింది. ఆ తర్వాత కొంతకాలానికి ఈ వ్యవహారం మరుగున పడింది.  
    సత్యవోలు శేషగిరిరావు ఎవరు? 
    రాజమహేంద్రవరం నగరంలో అనేక విలువైన స్థలాలు సత్యవోలు పాపారావుకు చెందినవిగా ప్రచారం జరుగుతోంది. ఆదెమ్మ దిబ్బ ప్రాంతానికి 40 ఏళ్ల క్రితం వరకు అప్పుడప్పడు పాపారావు వచ్చినట్లుగా అక్కడ పేదలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆ స్థలం సత్యవోలు శేషగిరిరావు వద్ద తాను కొనుగోలు చేసినట్లు కొలమూరుకు చెందిన  పిన్నమరెడ్డి ఈశ్వరుడు స్థల పరిశీలనకు వచ్చిన రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులకు చెబుతున్నారు. ఎప్పటి నుంచో ఉంటున్న పేదలపై దౌర్జన్యం చేస్తున్న కబ్జాదారుల అగడాలను ‘సాక్షి’ గత రెండు రోజులుగా వెలుగులోకి తేవడంతో ఇటు రెవెన్యూ, అటు కార్పొరేషన్‌ అధికారుల్లో కదలిక వచ్చింది. ఓ వైపు అధికారులు పరిశీలిస్తున్నా కబ్జాదారులు తమ పని కానిచ్చేస్తుండడం గమనార్హం. మంగళవారం  కూడా 36వ డివిజ¯ŒS పరిధిలోని ఇళ్లను యథేచ్ఛగా తొలగించారు.
    స్థలాన్ని పరిశీలించిన నగరపాలక సంస్థ అధికారులు...
    వివాదాస్పద ఆదెమ్మ దిబ్బ స్థలాన్ని నగరపాలక సంస్థ రెవెన్యూ, అర్బ¯ŒS రెవెన్యూ అధికారులు మంగళవారం పరిశీలించారు. సోమవారం స్థలాన్ని పరిశీలించిన అర్బ¯ŒS తహసీల్దార్‌ పోశయ్య ఈ స్థల సర్వే నంబర్‌ రెవెన్యూ పరిధిలోకి రాదని, టౌ¯ŒS సర్వే నంబర్‌ పరిధిలోకి వస్తుందని చెప్పడంతో నగర పాలక సంస్థ అధికారులు, రెవెన్యూ అధికారుల బృందం అక్కడకి వచ్చింది. జరుగుతున్న పనులను పరిశీలించిన అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లన్నారు. రికార్డులు పరిశీలించి తదుపరి చర్యలు చేపడతామని సర్వేయర్‌ ప్రభాకర్‌రావు తెలిపారు. బృందంలో టీపీఎస్‌ చంద్రశేఖర్, అర్బ¯ŒS సర్వేయర్‌ లక్ష్మి, వీఆర్‌వో వాసు తదితరులున్నారు.
    వాంబే గృహాలు కట్టిస్తామని స్లిప్పులు
    ఆదెమ్మదిబ్బ స్థలంలో10 బ్లాకుల్లో వాంబే గృహాలు నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. లబ్థిదారులను ఎంపిక చేసింది. దశలవారీగా ఏ నుంచి హెచ్‌ వరకు తొమ్మిది బ్లాకులను నిర్మించింది. తమకు కేటాయించిన గృహాల నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడే గుడిసెలు వేసుకుని ఉంటున్న పేదలు అందులో చేరారు. ప్రస్తుతం ’ఐ’ బ్లాకు నిర్మించాల్సి ఉంది. ఐ బ్లాక్‌లో గృహాలు పొందని వారికి అధికారుల సంతకాలతో కూడిన స్లిప్పులు ఇచ్చారు. ప్రస్తుతం అవి వారి దగ్గర భద్రంగా ఉన్నాయి. తమకు ఇళ్లు ఇస్తామని స్లిప్పులు కూడా ఇచ్చారని, అవి వచ్చే వరకు ఇక్కడే ఉంటున్నామని నీలం రమణమ్మ తెలిపింది. ప్రస్తుతం గుడిసెలు ఖాళీ చేయాలంటున్నారని ఏం చేయాలో తెలియడంలేదని వాపోతోంది. 
     
>
మరిన్ని వార్తలు