ఇక పుట్టుకతోనే ఆధార్‌..

4 Aug, 2016 23:42 IST|Sakshi
పేట్లబుర్జు ఆస్పత్రిలో ట్రయల్‌రన్‌ నిర్వహిస్తున్న దృశ్యం

సాక్షి,సిటీబ్యూరో: బిడ్డ పుట్టగానే ఆధార్, జనన సర్టిఫికెట్ల జారీకి జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ రెండు ద్రువ పత్రాలను ఏకకాలంలో అందించనుంది. ఇందుకు పది ప్రభుత్వ ఆస్పత్రులతో సహా మొత్తం 25 ఆస్పత్రుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. తొలుత ప్రముఖ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నారు. పేట్ల బురుజు ఆధునిక మెటర్నిటీ సెంటర్‌లో తొలుత ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఆస్పత్రిలో ట్రయల్‌రన్‌ కూడా నిర్వహించారు.

ఆటంకాలు లేకపోవడంతో ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్‌ మెటర్నిటీ ఆస్పత్రుల్లో కూడా అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. అన్నింటినీ ఒకే రోజు మున్సిపల్‌ పరిపాలన, వైద్య ఆరోగ్యశాఖ మంత్రుల ద్వారా లాంఛనంగా ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. పేట్లబురుజుతో పాటు కోఠి, కింగ్‌కోఠి, గాంధీ, మలక్‌పేట, వనస్థలిపురం తదితర ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు, ఈఎస్‌ఐ మెటర్నిటీ ఆస్పత్రి, తగిన సదుపాయాలున్న ప్రైవేట్, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ వచ్చేనెల


 

>
మరిన్ని వార్తలు