సామూహిక హరితహరాన్ని విజవయంతం చేయండి

16 Jul, 2016 23:29 IST|Sakshi
సామూహిక హరితహరాన్ని విజవయంతం చేయండి

ఆదిలాబాద్ కల్చరల్: ఆదిలాబాద్ మున్సిపాలిటి పరిధిలో సోమవారం నిర్వహించే సామూహిక హరితహరం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ కె. అలువేలు మంగతాయారు అన్నారు. పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో  శనివారం  స్వయం సహయక సంఘాలతో హరితహరం కార్యక్రమం  పై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ హఱితహరం కార్యక్రమంలో ప్రతిఒక్కరు భాగస్వాములయ్యేలా కాలనీవాసులను చైతన్యం చేయాలని, ప్రతి ఒక్కరు రెండు మొక్కలు నాటాలని సూచించారు.

పట్టణంలోని 36 వార్డులో మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందని, ఆయా కాలనీలకు సంబంధించి స్వయం సహయక సంఘాలు ఇందులో పాల్గొనాలని చెప్పారు. ప్రజలందరిని మొక్కలు నాటించే విధంగా చైతన్యవంతుల్ని చేయాలని సూచించారు. మొక్కలు నాటడం వలన కలిగే లాభాలను  తెలియజేయాలని చెప్పారు. ముందుస్తుగా అధికారులతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రతి వార్డులో వార్డు లేవల్ అధికారులుంటారని, ఆ కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమం సాగుతుందా లేదా..

అనేది ఫోన్‌ద్వార సమాచారం తెలుసుకునేందుకు సిబ్బందిని నియామించినట్లు చెప్పారు ఎప్పటికప్పుడు ఆ సమాచారంతో ఆయా కాలనీలకు వెళ్తూ మొక్కలను నాటుతాయని చెప్పారు. 18న ఉదయం 7 గంటల నుంచి మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ఇందులో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మంద రవిబాబు, శానీటరీ ఇన్స్‌స్పెక్టర్లు ఆయాజ్, జగదీశ్వర్‌గౌడ్, టీపీబీవో అనురాధ, ఏఈ నవీన్‌కుమార్; హరితహరం ఇంచార్జి కె. శ్రీనివాస్, ఐకేపీ టౌన్ మిషన్ కో ఆర్టినేటర్ భాగ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు