ఆదివాసీ జిల్లా కోసం కదిలిన దండు

21 Jul, 2016 23:30 IST|Sakshi
  •  భారీగా తరలివచ్చిన ఆదివాసీలు
  • జోడేఘాట్‌తో కూడిన కొమరం భీమ్‌ జిల్లా కోసం డిమాండ్‌
  • ఆదివాసీలను విచ్ఛిన్నం చేసే కుట్రేనని ఆరోపణ
  • కెరమెరి : ఆదివాసీ ప్రత్యేక జిల్లా కోసం ఆదివాసీల దండు కదిలింది. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఆదివాసీలు గురువారం భారీగా తరలి రావడంతో జోడేఘాట్‌ మరో సారి దర్బార్‌ను తలపించింది. హట్టి నుంచి జోడేఘాట్‌ వరకు వందలాది మందితో మోటార్‌ సైకిల్‌ ర్యాలీని నిర్వహించారు. అనంతరం కొమరం భీమ్‌ సమాధికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహిరంగ సభలో ఆదివాసీ వక్తలు, వివిధ సంఘాల నాయకులు, ఆఇఫాబాద్‌ మాజీ ఎమ్మేల్యే ఆత్రం సక్కు, హెచ్‌ఆర్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రం భగవంత్‌రావు, మాజీ జెడ్పీ చైర్మన్‌ సిడాం గణపతి, ఆదివాసీ రచయితల సంఘం నేత మైపతి అరుణ్‌కుమార్, వరంగల్‌ అడ్వోకేట్‌ పాపాలాల్, ప్రోఫెసర్‌ నాగేశ్వరరావు, జేఏసీ జిల్లా నాయకులు కనక యాదోరావు, వెడ్మ బొజ్జులు మాట్లాడారు. ఆదివాసీలను విడదీసే కుట్రలో భాగమే జిల్లాల పునర్విభజన అని, అందరు ఆదివాసీలు కలిసికట్టుగాఉంటే రాన్ను కాలంలో ఏలుతారని భావించి సీఎం కేసీఆర్‌ కట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కొమురం భీమ్‌ మండలాన్ని వేరే జిల్లాలో కలిపి కెరమెరిని మాత్రం ఆదిలాబాద్‌ లో కలుపుతామని ప్రకటించడం సరికాదన్నారు. మాననాటే.. మావరాజ్‌ (మా గ్రామంలో మా రాజ్యం ) వస్తే మనం బాగుపడతామన్నారు. ఇందుకు ప్రత్యేక జిల్లా సాధించి తీరుదామన్నారు. ఇంద్రవెల్లి నుంచి కౌటాల వరకు 13 మండలాలల్లో ప్రత్యేక జిల్లాను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేని ఎడల ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 
    మంచిర్యాలలో కొమురం భీమ్‌ విగ్రహం పెట్టనివ్వలేదు
    – కుంరం సోనేరావు
    గతంలో మంచిర్యాలలో తాత కొమురం భీమ్‌ విగ్రహం పెడతామంటే అరెస్ట్‌ చేశారు. మంచిర్యాలలో తాతకు అవమానం జరిగింది. అలాంటి జిల్లాలో ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అంటూ కొమురం భీమ్‌ మనవడు కొంమురం సోనేరావు అన్నారు. జోడేఘాట్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఐక్యమంత్యంతో ఉంటే ఆదివాసీ జిల్లా ను సాధించుకో గలుగుతామన్నారు. 
    ఆసిపాబాద్‌ జిల్లా చేస్తే మంచిది
    – ఏమాజీ
    27 సంవత్సారాలు ఆసిపాబాద్‌ జిల్లా ఉంది. అందుకు ఆసిఫాబాద్‌ జిల్లా చేస్తే మంచిదని జెడ్పీటీసీ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే ఏమాజీ అన్నారు. జోడేఘాట్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. 5 నుంచి 8 వందల ఎకరాలు వరకు ప్రభుత్వ భూమి ఉందని జిల్లా ఏర్పాటకు ఇది సరిపోతుందని అన్నారు. ప్రభుత్వం కార్యాలయాలు సైతం అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రజల సౌలభ్యం కోసం ఆసిపాబాద్‌ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నైతం నారాయణ, జనార్ధన్, ఆత్రం లక్ష్మణ్, కోవ, అనక దేవ్‌రావు, కనక మాదవ్‌రావు, కుసుంబ్‌ రావు, సుగుణ, శేకర్, విజయ్‌కుమార్,  మడావి కన్నిబాయి, వెంకటేశ్, బీజేపీ నాయకులు అంజనేయులు గౌడ్, పౌడల్, నాగేశ్వర్‌రావు, భీంరావు తదితరులున్నారు. 
     
మరిన్ని వార్తలు