జిల్లాలో ఆదోని మున్సిపాలిటీ బెస్ట్‌

4 Nov, 2016 22:27 IST|Sakshi
జిల్లాలో ఆదోని మున్సిపాలిటీ బెస్ట్‌
 – ఎమ్మిగనూరు అధ్వానం
– కేంద్రకమిటీ ప్రత్యేక బృందం సభ్యుల వెల్లడి
 
ఆదోని టౌన్‌ : జిల్లాలోని  మున్సిపాలిటీల్లో ఆదోని మున్సిపాలిటీ బాగుందని స్వచ్ఛ భారత్‌ మిషన్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఆఫ్‌ ఇన్‌స్పెక‌్షన్‌ కేంద్ర కమిటీ సభ్యుడు విజయ్‌ తెలిపారు. సామూహిక, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్వహణపై కొన్ని మార్పులు, చేర్పులు జరిగినట్లయితే ఆదోని పరిశుభ్రతలో మంచిఫలితాలు సాధించవచ్చని చెప్పారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా  కేంద్ర కమిటీ ప్రత్యేక బృందం శుక్రవారం ఆదోనిలో పర్యటించింది. అనంతరం  కమిటీ సభ్యుడు విజయ్‌ విలేకరులతో మాట్లాడారు. భారతదేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ఆరుబయట మలమూత్ర విసర్జన లేకుండా చేయడమే స్వచ్ఛభారత్‌ లక్ష్యమన్నారు. జిల్లాలో  ఇప్పటివరకు నంద్యాల, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, కర్నూలు, ఆదోని మున్సిపాలిటీలలో పర్యటించామని చెప్పారు. శనివారం డోన్‌లో పర్యటించనున్నట్లు చెప్పారు. అయితే అన్ని మున్సిపాలిటీల కన్న ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో ఆరుబయట మలమూత్ర విసర్జన ఎక్కువగా ఉందని, శానిటేషన్‌ సైతం  అధ్వానంగా ఉందని చెప్పారు. ఆదోని పట్టణంలో 9ప్రాంతాల్లో పర్యటించామని, అందులో కొన్ని ప్రాంతాల్లో ఆరుబయట మలవిసర్జన ప్రాంతాలు ఉన్నాయని అయితే వాటిని బాగు చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు.  
 
మరిన్ని వార్తలు