ఆదోని యార్డులో రూ.10.5 కోట్ల వ్యాపారం

21 Oct, 2016 00:51 IST|Sakshi
ఆదోని యార్డులో రూ.10.5 కోట్ల వ్యాపారం
ఆదోని: స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గురువారం రికార్డు స్థాయిలో వ్యవసాయ దిగుబడుల వ్యాపారం జరిగింది. దాదాపు రూ.10.55 కోట్ల దిగుబడులు అమ్మకానికి వచ్చినట్లు అంచనా. యార్డు చరిత్రలో ఒకే రోజు ఈ స్థాయిలో క్రయ, విక్రయాలు జరగడం ఇదే ప్రథమం. అత్యధికంగా పత్తి దిగుబడులు 18,448 క్వింటాలు అమ్మకానికి రాగా క్వింటాలు రూ.4050– రూ.5670 మధ్య ధర పలికింది. మోడల్‌ ధర రూ.5419గా రికార్డయింది. ఈ లెక్కన పత్తి వ్యాపారమే రూ.9.9కోట్లకుపైగా సాగినట్లు వ్యాపార వర్గాలు అంచనా. మిగతా వాటి మోడల్‌ ధరను తీసుకుంటే వేరుశనగ రూ.4492, ఆముదం రూ.2912 పలికింది. మొత్తంగా రూ.10.55 కోట్లు వ్యాపారం జరిగినట్లు యార్డు అధికారులు తెలిపారు. అయితే టెండర్లు ఖరారులో జాప్యం కారణంగా  పత్తి తూకాలు సగానికి పైగా శుక్రవారానికి వాయిదా పడ్డాయి. 
 
మరిన్ని వార్తలు