ప్రశాంతంగా ఏఈఈ పరీక్ష

6 Nov, 2016 21:40 IST|Sakshi
కాకినాడ సిటీ : 
రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిష¯ŒS (ఏపీపీఎస్‌సీ) ద్వారా నిర్వహించిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) రాత పరీక్ష  జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. కాకినాడ, రాజమహేంద్రవరం, రామచంద్రపురం, అమలాపురంలలో 15 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్ష నిర్వహించారు. 5,621 మంది అభ్యర్థులకు గాను 4,182 మంది హాజరయ్యారు. కాకినాడలోని పలు సెంటర్లను జాయింట్‌ కలెక్టర్‌–2 జె.రాధాకృష్ణమూర్తి, ఆర్డీఓ బి.ఆర్‌.అంబేడర్, ఏపీపీఎస్సీ సభ్యుడు కె.పద్మరాజు పరిశీలించారు.
హాల్‌ టికెట్లలో పొరపాట్లు  
ఏఈఈ రాత ఈ పరీక్షలకు సంబంధించి పలువురు అభ్యర్థుల హాల్‌ టికెట్లలో తప్పులు దొర్లాయి. కాకినాడలోని పలు సెంటర్లతో పాటు రామచంద్రపురం, రాజమండ్రిల్లో నిర్వహించిన కేంద్రాల్లో 12 మంది అభ్యర్థులకు ఇద్దరిద్దరికి ఒకే నంబర్‌ హాల్‌టికెట్లపై రావడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. మెకానికల్‌ సబ్జెక్టు అభ్యర్థులకు సివిల్‌ అని, సివిల్‌ అభ్యర్థులకు మెకానికల్‌ అని ఐదుగురికి వచ్చారు. దీంతో జిల్లా అధికారులు పొరపాట్లను గుర్తించి పబ్లిక్‌ సర్వీస్‌ కమిష¯ŒS ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచనల మేరకు ఒకే నంబర్‌ హాల్‌టికెట్‌ వచ్చిన అభ్యర్థులకు నంబర్‌ ’ఏ’ పెట్టి పరీక్షకు అనుమతించాలని, అలాగే సివిల్, మెకానికల్‌ అని హాల్‌ టికెట్‌ వచ్చిన తప్పులను అభ్యర్థులే సరిదిద్దుకొని డిక్లరేష¯ŒS తీసుకొని పరీక్షకు అనుమతించాలని సూచించడంతో ఆ మేరకు అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు చర్యలు తీసుకున్నారు. దీనిపై జేసీ రాధాకృష్ణమూర్తిని వివరణ కోరగా కొందరి హాల్‌టికెట్లలో పొరబాట్లు వచ్చాయన్నారు. ఏపీపీఎస్సీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచనల మేరకు అభ్యర్థులను పరీక్షకు అనుమతించామన్నారు.
 
>
మరిన్ని వార్తలు