పది నెలల తర్వాత..

7 Apr, 2017 00:57 IST|Sakshi
భర్త, అత్తమామల వేధింపులు భరించలేక ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె ఆచూకీ పది నెలల తర్వాత లభ్యమైంది. ఒకరింట్లో పనికి కుదిరిన ఆమెను పోలీసులు గుర్తించి ఆరాతీయగా ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రశాంతంగా జీవిస్తున్నట్టు తెలపడం విశేషం. పోలీసుల కథనం ప్రకారం విరాలిలా.. 
గణపవరం (నిడమర్రు) : అర్థవరం గ్రామానికి చెందిన గృహిణి సాగిరాజు జయ(38)గత ఏడాది జూలై 2న ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. కుటుంబ సభ్యులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. చివరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కూడా గాలించినా ఆచూకీ కనుగొనడం కష్టమైంది. ఈ క్రమంలో జయ మిస్సైన కేసు విషయంలో విచారణ నిమిత్తం కోర్టు ఆదేశాల మేర మరోసారి ఆమె ఆచూకీ కోసం గణపవరం సీఐ ఎ¯ŒS.దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. టినర్సాపురం మండలం కె.జగ్గవరం గ్రామంలో వెలిది కృష్ణమూర్తి ఇంట్లో పని చేసుకుంటున్నట్టు తెలుసుకుని గురువారం ఆమెను గణవరం తీసుకువచ్చారు. జయను అమె తల్లి కొత్తపల్లి పార్వతికి గణపవరం తహసీల్దారు ఎస్‌.ఇస్మాయిల్‌ సమక్షంలో గణపవరం ఎస్సై డి.హరికృష్ణ అప్పగించారు. భర్త, అత్తమామలు వేధింపులు భరించలేకనే ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు జయ వాపోయింది.
 
మరిన్ని వార్తలు