ఆదోని డివిజన్‌కు మళ్లీ నిరాశే..

1 Sep, 2016 00:18 IST|Sakshi
ఆదోని డివిజన్‌కు మళ్లీ నిరాశే..
60వేల ఎకరాల్లో ఎండిన పంటలు
– కర్నూలు, నంద్యాల డివిజన్‌లలో భారీ వర్షం
– బండిఆత్మకూరులో 68.2 మి.మీ., వర్షపాతం
 
కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలోని వివిధ మండలాల్లో మంగళవారం రాత్రి కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అయితే ఆదోని రెవెన్యూ డివిజన్‌కు మళ్లీ నిరాశే మిగిలింది. ఆలూరు, ఆస్పరి, ఆదోని, చిప్పగిరి, పత్తికొండ, ఆలూరు, దేవనకొండ, హాలహర్వి తదితర మండలాల్లో వర్షాల్లేక దాదాపు 60వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా ఎండిపోయాయి. పంటలను కాపాడేందుకు రెయిన్‌గన్‌లు వినియోగించక తప్పని పరిస్థితి నెలకొంది. బండిఆత్మకూరులో అత్యధికంగా 68.2 మి.మీ., వర్షపాతం నమోదయింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షాలు కురిసినా 18 మండలాల్లో 5 మి.మీ., లోపే ఉండటం గమనార్హం. ఇందులో అత్యధికం ఆదోని డివిజన్‌ మండలాలే. 32 మండలాల్లో ఒక మోస్తరు వర్షం.. అంటే 10 మి.మీ., లోపు ఉంది. జిల్లా మొత్తం మీద 14.7 మి.మీ., వర్షపాతం నమోదయింది. కర్నూలు, కల్లూరు మండలాల్లో భారీ వర్షాలు పడటంతో రైతులు ఉపశమనం పొందుతున్నారు. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 135 మి.మీ., ఉండగా.. 80.1 మి.మీ., మాత్రమే నమోదు అయింది.
 
వర్షపాతం (మి.మీ.,)
బండిఆత్మకూరు – 68.2
బేతంచెర్ల – 55.5
కర్నూలు – 48.2
కల్లూరు – 48.2
మహనంది – 38.6
కొత్తపల్లి – 36.6
నందికోట్కూరు – 36
పగిడ్యాల – 36
ఆత్మకూరు – 33
 
మరిన్ని వార్తలు