గోదావరికి మళ్లీ వరద పోటు

7 Aug, 2016 22:47 IST|Sakshi
కొవ్వూరు : గోదావరికి వరద మళ్లీ పొటెత్తింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరింది. ఎగువన మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు భద్రాచలంలో నీటిమట్టం భారీగా పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం నీటిమట్టం 38.20 అడుగులకు చే రింది. దీంతో దిగువన ధవళేశ్వరంలో నీటిమట్టం పెరుగుతుంది. ఆనకట్ట వద్దకి 6,35,171 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీనిలో ఉభయగోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు 12,100 క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నారు. ఆనకట్టకి ఉన్న 175 గేట్లను మీటరున్నర ఎత్తు లేపి 6,23,071 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. జిల్లాలోని పశ్చిమ డెల్టాకి 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారానికి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
 
 
 
 
మరిన్ని వార్తలు