నేటి నుంచి మహాకుంభాభిషేకం

2 Feb, 2017 02:02 IST|Sakshi
నేటి నుంచి మహాకుంభాభిషేకం

కంచి పీఠాధీశుల పర్యవేక్షణ
ఆగమశాస్త్ర పద్ధతిలో నిర్వహణ


శ్రీకాళహస్తి: ముక్కంటిక్షేత్రం మహాకుంభాభిషేకం మహోత్సవాలకు ముస్తాబైంది. 17ఏళ్ల తర్వాత రాహుకేతు క్షేత్రంలో కుంభాభిషేకం శోభ నెలకొంది. గురువా రం నుంచి 8వతేదీ వరకు అంగరంగ వైభవంగా కంచి పీఠాధీశులు శ్రీజయేంద్ర సరస్వతి, శ్రీ విజయేంద్రసరస్వతి పర్యవేక్షణలో ఆగమశాస్త్ర పద్ధతిలో నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. 12వ శతాబ్దానికి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఐదోసారి మహాకుంభాభిషేకానికి శ్రీకారం చుట్టారు. నాలుగో కుంభాభిషేకాన్ని 2000లో కంచి పీఠాధీశుల పర్యవేక్షణలో వేడుకగా నిర్వహించారు. మరోసారి ఆయన సారథ్యంలోనే ఈసారి కూడా సంప్రదాయపద్ధతులను అనుసరిస్తున్నారు. ఆ యన శిష్య బృందం ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షిస్తోంది. లోటుపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దుతున్నారు. 2వతేదీన గాలిగోపురం కుంభాభిషేకం, గణపతి హో మం, వాస్తుశాంతి, 3వతేదీ గోపూజ, ధనపూజ, మత్స్యగ్రహణం, 4వతేదీ యాగప్రవేశం కుంభస్థాపన, నైవేద్యాలు, దీపారాధన, 5వ తేదీన పరివార దేవతల గోపురాలకు కంచుగడప గోపురానికి స్వర్ణ కలశ స్థాపన,  6వతేదీన యాత్రదానం, యాగపూజ, కుంభోద్వాసన, 7వ తేదీన స్వామి, అమ్మవార్లు, నటరాజస్వామి వార్ల విమాన గోపురాలకు స్వర్ణ కలశస్థాపన, 8న స్వామి, అమ్మవార్లు, నటరాజస్వామి కుంబాభిషేకంతో మహాకుంభాభిషేకం మహాత్సోవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాల నేపథ్యంలో 4 నుంచి 8వ తేదీ వరకు స్వామి,అమ్మవార్ల మూలవిరాట్‌ దర్శనాలు రద్దు చేశారు. అలంకార మండపంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మాత్రమే భక్తులు దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని ఆలయ వర్గాలు స్పష్టం చేశాయి.

 

>
మరిన్ని వార్తలు