‘ఏజెన్సీ’ జిల్లా ఏర్పాటు చేయాలి

20 Aug, 2016 23:55 IST|Sakshi
మాట్లాడుతున్న చందా లింగయ్య దొర
  • ఆదివాసీ ఐకాస చైర్మన్‌ చందా లింగయ్య దొర
  • గిరిజనుల రౌండ్‌ టేబుల్‌ సమావేశం
  • జూలూరుపాడు : జిల్లాలోని 24 ఏజెన్సీ మండలాలతో కూడిన భద్రాద్రి(కొత్తగూడెం) జిల్లా ఏర్పాటు చేయాలని ఆదివాసీ ఐక్య కార్యాచరణ సమితి(ఐకాస) చైర్మన్‌ చందా లింగయ్య దొర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ ఆధ్వర్యంలో గిరిజనుల రౌండ్‌ టేబుల్‌ సమావేశం శనివారం జరిగింది. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఏన్కూరు, జూలూరుపాడు, సింగరేణి(కారేపల్లి), గార్ల, బయ్యారం, పెనుబల్లి ఏజెన్సీ మండలాలతోపాటు పాక్షిక గ్రామాలను కలుపుతూ కొత్తగూడెం కేంద్రంగా భద్రాద్రి జిల్లాను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాభిప్రాయం మేరకు జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు. ఏజెన్సీలోని ఖనిజ, నిధి నిక్షేపాలను, ఆదివాసీ ప్రత్యేక బడ్జెట్‌ను మైదాన ప్రాంతాల అభివృద్ధికి పాలకులు వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు పొడుగు శ్రీనివాస్, సోది వీరయ్య, జార ఆదినారాయణ, ఆరెం రామయ్య, వాసం రామకృష్ణ దొర, ఈసాల సురేష్, గుగులోతు ధర్మా, బాబురావు, దారావతు కాన్షీరాం, సర్పంచ్‌లు లకావత్‌ గిరిబాబు, ఈసాల వెంకటేశ్వర్లు, కట్రం మోహన్‌రావు, పాయం వెంకటరమణ, వైస్‌ ఎంపీపీ కొడెం సీతాకుమారి, జూలూరుపాడు, ఏన్కూరు మండలాల ఏఎస్‌పీ అధ్యక్షుడు ఈసం నరసింహ, పూసం సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు