డీలర్లకు కొత్త బాధ్యతలు

18 Nov, 2016 03:29 IST|Sakshi
డీలర్లకు కొత్త బాధ్యతలు

నెలలో సగం రోజులు బ్యాంకు ఏజెంట్లుగా విధులు
త్వరలోనే వీరికి శిక్షణ

తిరుపతి మంగళం: చౌక దుకాణాల డీలర్ల సేవలను ప్రభుత్వం విసృ్తతం చేయాలని నిర్ణరుుంచింది. ఇన్నాళ్లూ లబ్ధిదారులకు సరుకులు మాత్రమే అందించేవారు. ఇప్పుడు బ్యాంకులకు బిజినెస్ కరస్పాండెంట్ (బీసీ)లుగా కూడా వారు పనిచేయనున్నారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓిపీ) ద్వారా వారిని నియమించాలని ఈనెల 15న కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా  జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ చర్యలు చేపట్టారు. జిల్లా స్థారుు బ్యాంకర్ల కమిటీ (డీఎల్‌బీసీ) సమావేశం నిర్వహించేందుకు సిద్ధ మయ్యారు. తమ పరిధిలోని డీలర్లకు ఇందుకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఆర్డీవోలు, తహశీల్దార్లను ఆదేశించారు. దీనిపై గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సివిల్‌సప్లైస్ అధికారులతో సివిల్‌సప్లైస్ రాష్ట్ర కమిషనర్ రాజశేఖర్, డెరైక్టర్ రవిబాబు వీడియోకాన్ఫరెన్‌‌స నిర్వహించారు. నెలలో పదిహేను రోజులు లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేస్తారని, మిగతా పదిహేను రోజులు బిజినెస్ కరస్పాండెంట్లుగా ఉపయోగించుకుని బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని తెలిపారు. డీలర్ల వద్ద ఉన్న ఈ-పాస్ మిషన్‌కు యాప్‌ను జోడించి శిక్షణ కల్పిస్తారు.

డీలర్లు ఏంచేయాలంటే..
డీలర్లు తమ పరిధిలో, ప్రాంతంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు సాగిస్తారు. బ్యాంకులకు ప్రజలు చెల్లించాల్సిన రుణాలను స్వీకరించడం, వాటిని బ్యాంకుల్లో జమచేయం, రుణాలు తీసుకోదలచినవారికి అవసరమైన ఫారాలను ఇవ్వడం లాంటివి చేస్తారు. ఖాతాదారులకు, బ్యాంకులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు. ఇందుకుగాను వీరికి కమీషన్ చెల్లిస్తారు.

మరిన్ని వార్తలు