పోరు ఆగదు

30 Jul, 2016 22:05 IST|Sakshi
పోరు ఆగదు
యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో  కేంద్రం దిష్టి బొమ్మ దహనం 
విజయవాడ సెంట్రల్‌ : 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తోందని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్‌ అన్నారు. యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో  శనివారం ఆంధ్రరత్న భవన్‌ వద్ద కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు.  ఆయన మాట్లాడుతూ ప్రత్యేకSహోదాపై బీజేపీ, టీడీపీలు నాటకాలు ఆడుతున్నాయన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఆగస్ట్‌ 5న జరిగే ఓటింగ్‌లో పాల్గొని చట్ట సవరణకు సహకరించాలని కోరారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. పార్లమెంట్‌లో హోదాపై కేంద్రం సమాధానం ఏపీకి ద్రోహం చేయడమేనని చెప్పారు. కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యలను సీఎం ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.  ఏపీసీసీ నాయకులు ఆకుల శ్రీనివాస్, మీసాల రాజేశ్వరరావు, పార్టీ నగర నాయకులు కమలాకర్, బి.దుర్గారావు, వి.గవాస్కర్, బి.భాస్కర్‌ పాల్గొన్నారు. 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు