జీఎస్టీ బిల్లు సవరించే వరకూ పోరాటం

3 Nov, 2016 23:42 IST|Sakshi
జీఎస్టీ బిల్లు సవరించే వరకూ పోరాటం
మధురానగర్‌ : కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ బిల్లు సవరించే వరకు పోరాడతామని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష విధానాలను నిరసిస్తూ స్థానిక విజయవాడ ధర్నా చౌక్‌లో గురువారం వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యాన చేపట్టిన నిరాహార దీక్షలు గురువారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎక్తా డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ తోట రాజశేఖర్‌ మాట్లాడుతూ వస్తు సేవల పన్ను చట్టాన్ని కేంద్రం అన్ని రాష్ట్రాలతో కలిసి అమలు చేయాలని కోరారు. కేంద్రం అధికారాలను తమ వద్దే ఉంచుకుని రాష్ట్రాలను బలహీన పరుస్తోందని విమర్శించారు. కేంద్రlప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలతో వాణిజ్య పన్నుల శాఖల అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారే  ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డిప్యూటీ కమిషనర్‌ శేఖర్, రఘునాథ్‌ మాట్లాడుతూ వస్తు సేవల చట్టవ్యవస్ధలో రాష్ట్రాల ఉద్యోగులకు కేంద్ర ఎకై  ్సజ్‌ శాఖ సిబ్బందితో సమానంగా విధులు, అధికారాలు, జీతభత్యాలు ఇవ్వాలని కోరారు. అనంతరం విజయవాడ రెండో డివిజన్‌ కార్యదర్శి కే నాగరాజు, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వీఎస్‌ఎస్‌ఎన్‌ ప్రసాద్‌బాబు, దేవరకొండ శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. విజయవాడ రెండో డివిజన్, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన  అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు