రోడ్డుపై ప్రసవ వేదన

24 Aug, 2017 11:54 IST|Sakshi
రోడ్డుపై ప్రసవ వేదన

దిక్కులేని స్థితిలోప్రసవం
బాసటగా నిలిచిన జిమ్‌ యువకులు

 
తాడేపల్లిగూడెం రూరల్‌ : ఏ మృగాడి అకృత్యమో.. ఆమె పాలిట శాపంగా మారింది. నవమాసాలు నిండిన ఆమె దిక్కులేని స్థితిలో ప్రసవ వేదనతో అల్లాడిపోయింది. ఎట్టకేలకు మగశిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన బుధవారం ఉదయం స్థానిక ఆర్‌ అండ్‌ బీ బంగ్లా వెనుక బేతేలు చర్చి ఎదురుగా ఉన్న రోడ్డులో చోటుచేసుకుంది. ప్రసవ వేదనతో కొట్టుమిట్టాడుతున్న ఆమె (పేరు తెలియని మహిళ)ను ఉదయం జిమ్‌కు వెళ్తున్న ఒక అధ్యాపకుడు చూసి జిమ్‌లోని యువకులకు చెప్పాడు.

యువకులు కొలు కుల మోహన్, గండి వెంకటేష్, వెంకటరత్నం ఆర్‌ఎంపీ డాక్టర్‌ రాజు సహకారంతో ఆమెకు సపర్యలు చేశారు. ఆమె అక్కడే మగశిశువుకు జన్మనిచ్చింది. ఆమెను, శిశువును 108లో తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమ సులభం కాదు

ప్రయాణం అద్భుతంగా సాగింది

ఫుల్‌ నెగెటివ్‌

మల్టీస్టారర్‌ లేదట

మా కష్టమంతా మర్చిపోయాం

ఆనంద భాష్పాలు ఆగలేదు