కొత్త ఉద్యాన వంగడాల సాగుకు ప్రోత్సాహం

8 Dec, 2016 23:08 IST|Sakshi
కొత్త ఉద్యాన వంగడాల సాగుకు ప్రోత్సాహం
కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌
గండేపల్లి : ఉద్యాన పంటలలో కొత్త వంగడాలను సాగుచేసే రైతులకు ప్రోత్సాహం అందించనున్నట్టు కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ చెప్పారు. మండలంలోని సూరంపాలెం వద్ద ఏడీడీ రోడ్డు సమీపంలో జరుగుతున్న ఎనిమిది ఎకరాల బొప్పాయి సాగును గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా  విలేకరులతో మాట్లాడుతూ ఏజెన్సీ పరిధిలో రంపచోడవరంలో, అమలాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ డివిజన్ ఉద్యాన పంటల రైతులను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. ఏజెన్సీలో మామిడి, జీడిమామిడి మూడువేలకు పైగా ఎకరాల్లో పండిస్తున్నట్టు తెలిపారు. మెట్ట ప్రాంతంలో బొప్పాయి, అరటిలో బుషావళి తదితర పంటలను సుమారు వంద హెక్టార్ల వరకు  సాగవుతుండగా యాభైశాతం సబ్సిడీ కల్పించనున్నట్టు వివరించారు. మామిడి తాండ్ర తయారీదారులకూ ఈ అవకాశం కల్పించనున్నట్టు పేర్కొన్నారు. అనంతరం పామాయిల్‌తోటలో చాప్‌ కట్టర్‌ పని విధానాన్ని పరిశీలించారు. ఐదు అంచెల ఉద్యాన పంటల సాగును సందర్శించారు.  ఉద్యానశాఖ సహాయ సంచాలకుడు గోపికుమార్, ఉద్యానాధికారి సిహెచ్‌. శ్రీనివాస్, ఎంపీఈఓ రామకృష్ణ, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు