వరి మాగాణుల్లో మొక్కజొన్న భేష్‌

2 Dec, 2016 23:45 IST|Sakshi
వరి మాగాణుల్లో మొక్కజొన్న భేష్‌

– రెడ్డిపల్లి కేవీకే కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.లక్ష్మిరెడ్డి
అనంతపురం అగ్రికల్చర్‌ : రబీ పంటగా కోతలు పూర్తయిన వరి మాగాణుల్లో మొక్కజొన్న వేసుకోవడం వల్ల రైతుకు మంచి లాభదాయకమని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.లక్ష్మిరెడ్డి తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో నీటి వనరుల లభ్యత బాగా తగ్గిపోయిందన్నారు. రోజురోజుకు భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లబావుల ద్వారా నీరు రావడం లేదన్నారు. దీంతో రబీ పంటల సాగు కూడా తగ్గిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోతలు పూర్తయిన వరి పొలాల్లో ఎలాంటి దుక్కులు చేయకుండానే నేరుగా మొక్కజొన్న (జీరో టిల్లేజ్‌ మెయిజ్‌) వేసుకోవడం మంచిదని తెలిపారు.

+ వరి చేను కోత తర్వాత పొలంలో వరి దుబ్బుల్లో దుక్కి చేసుకోకుండానే పదును చూసుకుని మొక్కజొన్న విత్తనాలు విత్తుకోవాలి. వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు దూరంలో ఉండేలా విత్తాలి.  
+ దుక్కి చేసే ఖర్చు, సమయం, విద్యుత్‌ ఆదా, భూగర్భజలాల పెంపునకు ఉపయోగపడుతుంది.
+ విత్తిన వెంటనే వరి దుబ్బులు మొలకెత్తకుండా ఒక లీటరు పారాక్వాట్‌ 200 లీటర్ల నీటికి క లిపి విత్తుకున్న 24 గంటల్లోగా పిచికారీ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 08554–200416 నెంబర్‌లో సంప్రదించాలి. 

మరిన్ని వార్తలు