అగ్రిగోల్డ్‌ డెయిరీ కార్మికుల రాస్తారోకో

3 Sep, 2016 22:51 IST|Sakshi
అగ్రిగోల్డ్‌ డెయిరీ కార్మికుల రాస్తారోకో
లక్ష్మీనగర్‌ (ద్వారకాతిరుమల) : అగ్రిగోల్డ్‌ పాల డెయిరీని లాకౌట్‌ చేయడంతో రోడ్డున పడిన కార్మికులు శనివారం రాషీ్ట్రయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు ట్రాఫిక్‌ స్తంభించింది. సమాచారం అందుకున్న ద్వారకాతిరుమల ఎస్సై టి.నాగవెంకటరాజు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మారంపల్లి పంచాయతీ లక్ష్మీనగర్‌లోని అగ్రిగోల్డ్‌ అమృతవర్షిణి పాలడెయిరీని గురువారం రాత్రి యాజమాన్యం లాకౌట్‌ను ప్రకటించిన విషయం విధితమే. దీంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న దాదాపు 70 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డునపడ్డాయి.
అకస్మాత్తుగా యాజమాన్యం లాకౌట్‌ను ప్రకటిస్తే తమ పరిస్థితి ఏమిటంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తూ రాషీ్ట్రయ రహదారిపై బైఠాయించారు. కార్మికులకు సీఐటీయూ నాయకులు ఆర్‌.లింగరాజు, వై.సాల్మన్‌రాజు మద్దతు ప్రకటించారు. వీరు రాస్తారోకోలో కార్మికులతో పాటు పాల్గొని ఆందోళన చేశారు. కార్మికులకు యాజమాన్యం న్యాయం చేయకుంటే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం రాస్తారోకోను విరమించిన కార్మికులు ఫ్యాక్టరీ ఎదుట టెంట్‌ వేసి ఆందోళన చేపట్టారు.    
 
మరిన్ని వార్తలు