ఎయి‘డెడ్‌’ పాఠశాల

26 Jul, 2016 20:27 IST|Sakshi
ఎయి‘డెడ్‌’ పాఠశాల
ఫలితాలు సాధిస్తున్నా ఆదరణ కరువు
కోడెల నియోజకవర్గంలో అవస్థలు
 
ప్రముఖులు చదివిన పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తారనే నమ్మకంతో ఇక్కడ చేరాం. పరీక్షలు దగ్గరలో ఉన్నాయి. హిందీ, ఎన్‌ఎస్‌ బోధించేందుకు ఉపాధ్యాయులే లేరు. ఇక పరీక్షల్లో సమాధానాలు ఏమి రాయాలి. మాకు టీసీలన్న ఇవ్వండి లేదా ఉపాధ్యాయులునైనా నియమించండి. ఎనిమిది మంది 8,9,10 తరగతుల విద్యార్థులు ‘సాక్షి’తో అన్న మాటలు ఇవి...
 
సాక్షి, గుంటూరు/ సత్తెనపల్లి: ఒకప్పుడు అధిక సంఖ్యలో విద్యార్థులు... పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు... ఉత్తమ ఫలితాల సాధనతో ప్రై వేటు స్కూళ్ళను తలదన్నే రీతిలో సాగుతున్న ఎయిడెడ్‌ స్కూళ్లు ప్రస్తుతం కునారిల్లుతున్నాయి. టీచర్ల నియామకంలో జరుగుతున్న జాప్యం... సర్కారు అలసత్వం.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి స్కూళ్ళు చాలా ఉన్నా సత్తెనపల్లి పట్టణానికి సంబంధించి శరభయగుప్తా హిందూ ఉన్నత పాఠశాల ఒకటి. జిల్లా పరిషత్‌ పాఠశాలలకు సంవత్సరానికి రూ. లక్ష నుంచి రూ. లక్షన్నర బడ్జెట్‌ కేటాయిస్తున్న ప్రభుత్వం, ఈ పాఠశాల విషయంలో సాయం రూ. 7వేలకు మించడం లేదు.
 
1931లో స్థాపన..
 సత్తెనపల్లి శరభయగుప్తా హిందూ ఉన్నత ఎయిడెడ్‌ పాఠశాలను 1931లో స్థాపించారు. కొన్నాళ్ల వరకు 2,200 మంది వరకు విద్యార్థులు చేరారు. మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఆ సమయంలో బాలికల కోసం ప్రత్యేకంగా సత్తెనపల్లిలో బాలికోన్నత పాఠశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో కేవలం మగ పిల్లలు మాత్రమే 1,600 మంది వరకు చదువుతున్నారు. రానురానూ ఉపాధ్యాయులు తగ్గిపోవడంతో ప్రస్తుతం ఈ పాఠశాలలో 135 మంది మాత్రమే విద్యార్థులున్నారు. పది మంది ఉపా«ధ్యాయులు, ఇద్దరు నాన్‌ టీచింగ్‌ సిబ్బంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. హిందీ,  ఎన్‌ఎస్‌ సబ్జెక్టులు బోధించేందుకు ఉపాధ్యాయులు లేరు. గతంలో మరో ఎయిడెడ్‌ పాఠశాల కు సంబంధించిన ఉపాధ్యాయుడిని ఇక్కడ ఎన్‌ఎస్‌ బోధించేందుకు డిప్యూటేషన్‌ వేశారు. పాఠశాలలో జరిగిన గొడవల కారణంగా డిప్యూటేషన్‌ రద్దు చేసి ఎన్నాదేవి మండల పరిషత్‌ పాఠశాలకు బదిలీ చేశారు. హిందీ బోధించేందుకు   ఉపాధ్యాయుడిని  నియమించకపోవడంతో పిల్లలు చందాల ద్వారా పండిట్‌ కోర్సు చేసిన ఉపాధ్యాయురాలిని నియమించుకుని కాలం వెళ్లదీస్తున్నారు.  
కొరవడిన పర్యవేక్షణ...
   సత్తెనపల్లి పట్టణ నడిబొడ్డున ఉన్న శరభయగుప్తా హిందూ ఉన్నత  ఎయిడెడ్‌ పాఠశాలను విద్యా శాఖ అధికారులు సైతం పర్యవేక్షించడం లేదు. డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లిలో ఉపాద్యాయులు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
 
ఉపాధ్యాయులను నియమిస్తాం..
    శరభయ్య ౖహె స్కూల్‌ ఎయిడెడ్‌ పాఠశాల కావడంతో జిల్లాలో ఉన్న ఎయిడెడ్‌ పాఠశాలల నుంచి త్వరలో డెప్యుటేషన్‌పై ఉపాధ్యాయుల భర్తీ చేపడతాం. ఎస్‌జీటీలు ఈ పాఠశాలలో ఇద్దరు ఎక్కువగా ఉన్నారు. వారిని ఇతర పాఠశాలలకు డెప్యుటేషన్‌పై పంపే ఏర్పాటు చేస్తున్నాం.
డీఈఓ శ్రీనివాసరెడ్డి
మరిన్ని వార్తలు