'మూడేళ్లలో మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణం'

19 Dec, 2015 12:56 IST|Sakshi

విజయవాడ: మూడేళ్లలో మంగళగిరిలో ఎయిమ్స్ భవన నిర్మాణాన్ని పూర్తిచేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు.  గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు నడ్డా, వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. 193 ఎకరాల్లో 1618 కోట్ల రూపాయల వ్యయంతో ఎయిమ్స్ను నిర్మించనున్నట్టు జేపీ నడ్డా తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ.. 'మంగళగిరి ఎయిమ్స్ అమరావతికి మణిహారంలా నిలవబోతుంది. వైద్య సేవల కేంద్రంగా అమరావతి రూపుదిద్దుకుంటుంది. రెండేళ్లలోనే ఎయిమ్స్ నిర్మాణం పూర్తి చేయాలి' అని చెప్పారు. 'త్వరలోనే విజయవాడ మెట్రో రైలు టెండర్స్ పిలుస్తాం. విజయవాడ నుంచి అమరావతి మీదుగా గుంటూరు కి ప్రత్యేక ఎలక్ట్రికల్ ట్రైన్ సర్వీస్ ప్రారంభిస్తాం. ఏపీకి అన్యాయం జరిగింది కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఏ పథకం ప్రవేశ పెట్టినా ఏపీకి ప్రాధాన్యం ఉండేలా ప్రయత్నం చేస్తున్నాం' అని వెంకయ్యనాయుడు అన్నారు.

మరిన్ని వార్తలు