విమానాశ్రయ భూముల జాబితా విడుదల

2 Oct, 2016 02:34 IST|Sakshi
విమానాశ్రయ భూముల జాబితా విడుదల
 
దగదర్తి: దామవరంలో ఏర్పాటు కానున్న విమానాశ్రయం కోసం సేకరిస్తున్న దామవరం, కోత్తపల్లి కౌరుగుంట లబ్ధిదారుల జాబితాను శనివారం రెవెన్యూ అధికారులు విడుదల చేశారు. కోత్తపల్లి కౌరుగుంట పరిధిలోని సర్వే నెంబర్‌ 334,335లో గత నెలలో కోంత మేర చెల్లింపులు జరిగాయి. మిగిలిన 119 మందికి చెందిన లబ్ధిదారుల జాబితాను శనివారం రెవెన్యూ అధికారలు విడుదల చేశారు. విమానాశ్రయం కోసం సేకరిస్తున్న ఎలాంటి అభ్యంతరాలు లేని డీకేటీ భూములకు సంబంధించిన 11.54 ఎకరాలకు రెండు, మూడు రోజుల్లో పరిహారం అందచేయనున్నట్లు తహసీల్దార్‌  తెలిపారు.  
హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఆందోళన 
సాక్ష్యాత్తు రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వేనెంబరు 335లోని అనుభవదారులకు అనుకూలంగా ఇచ్చిన ఆదేశాలను రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాము 25 ఏళ్లకు పైగా భూములను సాగుచేసుకుంటున్నామని, ప్రస్తుతం ఈ భూములను విమానాశ్రయం కోసం సేకరిస్తున్నారని పరిహారం అందుకోవడానికి తాము అనర్హులమని రెవెన్యూ అధికారులు చెప్పడంతో కోత్తపల్లికౌరుగుంటకు చెందిన 38 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై పలుమార్లు జిల్లా అధికారులకు తెలిపినా పట్టించుకోలేదన్నారు. దీంతో కోత్తపల్లి కౌరుగుంటకు చెందిన 38 మంది రైతులు సెప్టెబరు 7వ తేదీన హైకోర్టును ఆశ్రయించారు. రిట్‌ పిటిష¯ŒS పేరుతో ఫిర్యాదును స్వీకరించిన హైకోర్టు 17.9.2016 తేదీన కోత్తపల్లి కౌరుగుంటకు చెందిన 38 మంది రైతులను భూముల్లో నుంచి తొలగించరాదని, వారికి పరిహారం అందిచే విషయంలో ఏమి చర్యలు తీసుకోంటున్నారో తెలపాలని  ఆదేశించిందన్నారు. ఈ విషయమై తాహసీల్దార్‌ మధుసూదనరావును వివరణ కోరగా  ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లబ్ధిదారుల జాబితా ప్రకటించడం జరిగిందని, హైకోర్టు ఆదేశాలు తమ కార్యాలయానికి అందలేదన్నారు. ఆదేశాలు అందిన తరువాత పరిశీలిస్తామన్నారు.

 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా