రేపటి నుంచి ఐసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన

25 Aug, 2016 00:37 IST|Sakshi
పోచమ్మమైదాన్‌ :ఐసెట్‌లో అర్హత సాధించిన వారు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 26 నుంచి 30 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగనుంది. జిల్లాలో రెండు హెల్ప్‌లైన్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. వరంగల్‌లో ప్రభుత్వ పాలిటెక్నిక్, హన్మకొండలో ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో హెల్ప్‌లైన్‌ సెంటర్‌లు ఏర్పాటు చేశారు. పీహెచ్‌సీ, స్పోర్ట్స్, ఎన్‌సీసీ, అంగ్లో ఇండియన్‌ విద్యార్థులు హైదారాబాద్‌లోని మాసబ్‌ ట్యాంక్‌ సమీపంలో గల సాంకేతిక విద్యా భవన్‌లో హాజరుకావాలి. అలాగే జిల్లాలకు చెందిన ఎస్టీ అభ్యర్థులు వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలి.
 
విద్యార్థులు ఇవి తీసుకురావాలి...
ఐసెట్‌ హాల్‌ టికెట్, ఒరిజినల్‌ ర్యాంక్‌ కార్డ్‌  
ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ ఒరిజినల్‌ మెమోలు
స్టడీ, కుల, ఆదాయ సర్టిఫికెట్లు, టీసీ 
ఓసీ, బీసీలు రూ1000, ఎస్సీ, ఎస్టీలు రూ.500 ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలి.
 
   పాలిటెక్నిక్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల
26న ఉదయం 1 నుంచి–3వేలు 3001 నుంచి 6వేల వరకు
మధ్యాహ్నం 6001 నుంచి 9 వేలు 9001 నుంచి 12 వేలు
27న ఉదయం 12001 నుంచి 15వేలు 15001 నుంచి 18 వేలు
మధ్యాహ్నం 18001 నుంచి 21వేలు 21001 నుంచి 24 వేలు
28న ఉదయం 24001 నుంచి 27000 27001 నుంచి 30వేలు 
మధ్యాహ్నం 30001 నుంచి 33వేలు 33001 నుంచి 36 వేలు
29న ఉదయం 36001 నుంచి 39500 39501 నుంచి 43 వేలు
మధ్యాహ్నం 43001 నుంచి 46500 46501 నుంచి 50 వేలు
30న ఉదయం 50001 నుంచి 53500 53501 నుంచి 57వేలు
మధ్యాహ్నం 57001 నుంచి 60500 60501 నుంచి చివరి ర్యాంక్‌ 
మరిన్ని వార్తలు