జాతీయస్థాయి హాకీ పోటీలకు అజయ్‌

19 Oct, 2016 20:30 IST|Sakshi
జాతీయస్థాయి హాకీ పోటీలకు అజయ్‌
రేటూరు(కాకుమాను): హాకీ అండర్‌14 జాతీయ స్థాయి పోటీలకు రేటూరు విద్యార్థి కె.అజయ్‌ ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు వీరచంద్ర బుధవారం తెలిపారు. ఇటీవల కర్నూలులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో అండర్‌ 14 విభాగం నుంచి పాఠశాలకు చెందిన కె.అజయ్‌ అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. వచ్చే నెల  హర్యానాలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో అతను పాల్గొంటారని చెప్పారు. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజారత్నం, ఉపాధ్యాయులు, విద్యార్థులు అజయ్‌ను అభినందించారు.
మరిన్ని వార్తలు