సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

28 Aug, 2016 20:10 IST|Sakshi
సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
పాశ్చ్యానాయక్‌తండ(చివ్వెంల) : సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట డివిజన్‌ మలేరియా నియంత్రణ అధికారి తీగల నర్సింహ అన్నారు. పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ఆదివారం మండల పరిధిలోని పాశ్చ్యానాయక్‌తండా ఆవాసాలు బద్యాతండా, పిల్లల జెగ్గుతండా, తుమ్మల జెగ్గుతండా, భోజ్యతండా, జయరాం గుడి తండా, హలవత్‌తండా, భీమ్లాతండా, పాండుతండాల్లో  ఇళ్లలో దోమల నివారణ మందులను స్ప్రే చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఇళ్ల మందు మురుగు నీరు నిలువ కుండా చూసుకోవాలని, వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్‌ సూపర్‌ వైజర్‌ బూతరాజు సైదులు, ఎఎన్‌ఎం లూర్దు మేరి, హెల్త్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆశ వర్కర్లు జ్యోతి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు