అన్ని జిల్లాల్లో స్టేడియంల నిర్మాణం

21 Sep, 2016 23:09 IST|Sakshi
అన్ని జిల్లాల్లో స్టేడియంల నిర్మాణం
ఉప ముఖ్యమంత్రి రాజప్ప
కొత్తపేటలో రాష్ట్ర స్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు ప్రారంభం
కొత్తపేట : రాష్ట్రానికి దేశానికి గుర్తింపు తీసుకువచ్చే క్రీడల అభివృద్ధికి అన్ని జిల్లాల్లో స్టేడియంల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కొత్తపేట రెడ్డి అనసూయమ్మ మెమోరియల్‌ ఇండోర్‌ షటిల్‌ స్టేడియంలో రాష్ట్ర స్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌–2016 అండర్‌–19 బాలురు, బాలికల పోటీలు బుధవారం రాత్రి ప్రారంభమయ్యాయి. స్థానిక కాస్మోపాలిటన్‌ రిక్రియేషన్‌ సొసైటీ ఫౌండర్‌ అంyŠ  చైర్మన్, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం(ఆర్‌ఎస్‌) ఆధ్వర్యంలో జిల్లా షటిల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి పర్యవేక్షణలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రారంభం సందర్భంగా జరిగిన సభకు ఎమ్మెల్సీ ఆర్‌ఎస్‌ అధ్యక్షత వహించగా హోంమంత్రి రాజప్ప, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, జెడ్పీ చైర్మన్‌ నామన రాంబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సభలో రాజప్ప మాట్లాడుతూ వర్థమాన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, పాత స్టేడియంల ఆధునికీకరణకు, కొత్త స్టేడియంల నిర్మాణాలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మరో మంత్రి సుజాత మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తారని దానిలో భాగంగా 1999లో హైదరాబాద్‌లో ఏసియన్‌ గేమ్స్‌ నిర్వహించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. మరో మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు కూడా అవసరమన్నారు. తొలుత మంత్రి సుజాత, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఎంపీపీ రెడ్డి అనంతకుమారిలు జ్యోతి  వెలిగించారు. ఈ సభలో పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు, మండలి విప్‌ అంగర రామ్మోహనరావు, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, కె.రవికిరణ్‌వర్మ, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కెవీ సత్యనారాయణరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ బండారు వెంకట సత్తిబాబు, జిల్లా షటిల్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు బామిరెడ్డి, ఉపాధ్యక్షురాలు కొడాలి తనూజ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం లాంఛనంగా పోటీలను రాజప్ప ప్రారంభించారు. 
క్వాలిఫై విజేతలు
రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి 85 టీమ్‌లు పోటీలకు హాజరుకాగా గురువారం జరిగే పోటీలకు నాకౌట్‌ విధానంలో ఎంపికలు జరిగాయి.  బాలుర సింగిల్స్‌ విభాగంలో పి.చంద్రాజ్‌ పట్నాయక్‌(విశాఖ), బి.గిరీష్‌నాయుడు(తూర్పుగోదావరి), కె.ఎం.రవి(విశాఖ), కె.సాయిచరణ్‌(గుంటూరు), ఎం.సాయికిరణ్, బి.రోహిత్‌కుమార్, వి.యశ్వంత్‌(విశాఖ), ఆమన్‌గౌడ్‌(తూర్పుగోదావరి)
బాలుర డబుల్స్‌ విభాగంలో పి.ఎస్‌.ఎన్‌ సంతోష్, టి.ఎన్‌.వీ సన్నీ(విశాఖ), చక్రధర్‌రెడ్డి, కె.విక్రాంత్‌(ప్రకాశం), ఏ. అరుణేష్, బి.గిరిష్‌నాయుడు(తూర్పుగోదావరి), డి.నితిన్, కె.హరికృష్ణ(తూర్పుగోదావరి) విజేతలుగా నిలిచారు.
మరిన్ని వార్తలు