విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

24 Sep, 2016 00:52 IST|Sakshi
  • ‘ఇన్‌స్పైర్‌’ను సందర్శించిన ఆర్‌జేడీ బాలయ్య
 మహబూబాబాద్‌ రూరల్‌ : విద్యార్థులు విద్య, శాస్త్ర, సాంకేతిక తదితర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని విద్యాశాఖ ఆర్‌జేడీ వై.బాలయ్య అన్నారు. మండలంలోని అనంతారం మోడల్‌ స్కూల్‌లో జిల్లా స్థాయి ఇన్‌స్పైర్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. పలు ఎగ్జిబిట్లను పరిశీలించి వాటి గురించి విద్యార్థులను అడిగారు. విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లు దేశంలోని పలు సమస్యలకు పరిష్కారం చూపుతాయని అన్నారు. రెండో రోజు కేయూ నుంచి వచ్చిన న్యాయ నిర్ణేతలు డాక్టర్‌ ఎం.రామచంద్రారెడ్డి, డాక్టర్‌ టి.లక్ష్మణరావు, డాక్టర్‌ బి.విజయపాల్‌రెడ్డి, ఎ.శ్రీనివాస్‌రెడ్డి, బి.సత్యనారాయణ, డాక్టర్‌ డి.శ్యామ్‌ప్రసాద్‌, ప్రొఫెసర్లు గోపికృష్ణ, సమ్మయ్య, దేవదాస్‌, మారాములు ప్రాజెక్టుల జడ్జిమెంట్‌ నిర్వహించారు. గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌ నుంచి పరిశీలకురాలిగా వచ్చిన రజినీశర్మ కూడా‍ ప్రాజెక్టులను పరిశీలించారు. డిప్యూటీ ఈవో తోట రవీందర్‌, ఎంఈవోలు వివేకానంద, వెంకన్న, లచ్చిరాం, బిక్షపతి, రత్నమాల, సృజన్‌కుమార్‌, ఇన్‌స్పైర్‌ జిల్లా రిసోర్స్‌పర్సన్‌లు వి.గురునాథరావు, టి.శ్రీనాథ్‌, బి.అప్పారావు పాల్గొన్నారు. కాగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల ఇన్‌స్పైర్‌ తిలకించేందుకు విద్యార్థులు తక్కువ సంఖ్యలో వచ్చారు.

 

మరిన్ని వార్తలు