సున్ని ఇస్తెమాకు సర్వం సిద్ధం

8 Jan, 2017 00:36 IST|Sakshi
కర్నూలు(ఓల్డ్‌సిటీ): అహ్లె సున్నతుల్‌ జమాత్, మర్కజీ మిలాద్‌ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలులో జాతీయ స్థాయి ఒక్కరోజు సున్ని ఇస్తెమా నిర్వహించనున్నారు. ఇస్తెమా ఫజర్‌ నమాజ్‌(తెల్లవారు జామున 6.00)కు మొదలై ఇషా నమాజ్‌ (రాత్రి 8.30) వరకు ఉంటుంది. రాష్ట్ర, అంతర్రాష్ట్ర ఉల్మాలు (ఆధ్యాత్మిక , దర్గాల పీఠాధిపతులు వక్తలుగా పాల్గొంటున్నారు. స్థానిక ఉస్మానియా కళాశాల మైదానంలో సుమారు 60 వేల మంది కూర్చునేందుకు వీలుగా షామియానా, కుర్చీలు తదితర ఏర్పాట్లు చేశారు. మనరాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ముస్లింలకు ఆకట్టుకునేలా ఐదు ప్రవేశ ద్వారాలు, వచ్చిన వారికి టిఫిన్లు, భోజనాలు వడ్డించేందుకు వీలుగా ప్రత్యేక వంట శాల విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇస్తెమాకు ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు అహ్లెసున్నతుల్‌ జమాత్‌ జిల్లా కార్యదర్శి సయ్యద్‌షా షఫిపాషా ఖాద్రి తెలిపారు. అజ్మీర్‌ దర్గా సజ్జాదే నషీన్‌ సయ్యద్‌ ఫజ్‌లుల్‌ మతీన్, గుల్బర్గా దర్గా సజ్జాదే నషీన్‌ సయ్యద్‌ ఖుస్రూ హుసేని ప్రసంగిస్తారన్నారు. ఐదు పూటలా నమాజులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఏర్పాట్లలో అహ్లె సున్నతుల్‌ జమాత్‌ సంయుక్త కార్యదర్శి సయ్యద్‌ ముర్తుజా ఖాద్రి కూడా ఉన్నారు.
 
మరిన్ని వార్తలు