సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

3 Aug, 2016 23:10 IST|Sakshi
సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
  • మందులు, వైద్యులు అందుబాటులో ఉండాలి 
  • జెడ్పీ  స్థాయీ సంఘ సమావేశంలో తుల ఉమ
  • నీటి విడుదల షెడ్యూల్‌ ప్రకటించాలన్న జీవన్‌రెడ్డి
  • కరీంనగర్‌ సిటీ :  సీజనల్‌ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యులు స్థానికంగా ఉండాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. విద్య, వైద్యంపై జెడ్పీ స్థాÄæూ సంఘం సమావేశాలు బుధవారం జెడ్పీ సమావేశమందిరంలో నిర్వహించారు. అధ్యక్షత వహించిన తుల ఉమ మాట్లాడుతూ... వైద్యులు స్థానికంగా ఉండడం లేదని, రోగులను మందులను బయట కొనుక్కోమంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రోగులకు ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేస్తున్న వైద్యులు వారిని సొంత ఆస్పత్రులకు రమ్మంటూ వైద్యం అందిస్తున్నారని అన్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న వైద్యులపై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.
    సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యులు, సిబ్బందికి సెలవులు పెట్టకుండా రోగులకు మెరుగైన సేవలందించాలని ఆదేశించారు. క్యాన్సర్, కిడ్నీ, గుండెసంబంధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు అవసరమైన మందులు అందించాలన్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్‌ దష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి భవనం పెచ్చులూడి రోగులు గాయపడిన సంఘటనలు పునరావతం కానీయరాదన్నారు. అలాంటి సమస్యలుంటే తమ దష్టికి తీసుకురావాలని, మరమ్మతులు చేయిస్తామని అన్నారు. జ్వరాలొస్తే ప్రైవేట్‌ ఆసుపత్రులకు పోయే పరిస్థితే ఉండొద్దన్నారు. ఏఎన్‌ఎంల నియామకంలో వయోపరిమితి పాటించాలన్నారు. 
    – మూడు వందల మంది విద్యార్థులకు పైగా ఉన్న పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లలో వాటర్‌ ఫిల్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. వందశాతం అక్షరాస్యత సాధించేలా సంబంధిత అధికారులు ఇప్పటినుంచే అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. 
    – జెడ్పీ వైస్‌ చైర్మన్‌ రాయిరెడ్డి రాజిరెడ్డి మాట్లాడుతూ.. అక్కన్నపేటతోపాటు తొమ్మిది పీహెచ్‌సీలను ప్రారంభించాలన్నారు. ఇల్లంతకుంట జెడ్పీటీసీ సిద్దం వేణు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఇరవై మండలాల్లో వైద్యులు స్థానికంగా ఉండడం లేదన్నారు. కనీసం ఈ సీజన్‌లోనైనా అందుబాటులో ఉండేలా ఆదేశాలివ్వాలన్నారు. కోహెడ జెడ్పీటీసీ పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. తమ మండలానికి 108 వాహనాన్ని కేటాయించాలని కోరారు. 
     
    నీటి విడుదల షెడ్యూల్‌ను ప్రకటించాలి
    ఎస్సారెస్పీ నీటి విడుదల షెడ్యూల్‌ను ప్రకటించాలని జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి సూచించారు. ఉదయం జెడ్పీ వైస్‌చైర్మన్‌ రాయిరెడ్డి రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన వ్యవసాయ స్థాÄæూ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నీటి విడుదల షెడ్యూల్‌ ప్రకటిస్తే అందుకు అనుగుణంగా రైతులు నార్లు వేసుకొంటారన్నారు. రుణమాఫీకి, రుణ మంజూరుకు సంబంధం లేదని ప్రభుత్వం చెబుతున్నా బ్యాంకర్లు ఈ రెండింటికి ముడిపెడుతున్నారని అన్నారు. రుణాల మంజూరుపై ఈసారి బ్యాంకర్లతో కలెక్టర్‌ సమావేశం ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ రైతుల పెట్టుబడికి ఉపయోగపడాలని, కేంద్రం నుంచి నిధులు వచ్చినా జిల్లాకు రావాల్సిన రూ.36 కోట్లు రాలేదన్నారు. 2014లో నష్టపోయిన రైతులకు హార్టికల్చర్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.6 కోట్లు ఇంకెప్పుడిస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటతో ఎరువుల అంచనాలు తలకిందులవుతాయని, పెరిగిన డిమాండ్‌ మేరకు అధికారులు ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరారు. రోళ్లవాగును డీ–53 ద్వారా నింపితే సారంగాపూర్, ధర్మపురి ప్రాంత రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాయికల్‌ తదితర ప్రాంతాల్లో ఎండిపోయిన మామిడితోటలకు నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనకు గడువు ముగిసినా బ్యాంకర్లు రైతుల నుంచి ప్రీమియం వసూలు చేస్తున్నారన్నారు. అలాంటిదేమీ లేదని జేడీఏ చెప్పడంతో జీవన్‌రెడ్డి లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ అంశంపై మంత్రితో చర్చిస్తామని జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ హామీ ఇచ్చారు. 
     
    – మల్హర్‌ జెడ్పీటీసీ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ భూసార పరీక్షలు చేసినా రిపోర్టులు ఇవ్వడం లేదన్నారు. ల్యాబ్‌లో సిబ్బంది లేకపోవడంతో ఇబ్బంది ఉందని జేడీఏ సమాధానం చెప్పడంతో.. ఎజెండాలో చేసినట్లు ఎందుకు చూపించారని ఆయన నిలదీశారు. మాచారంలో 16 మందికి డ్రిప్‌ ఏర్పాటు చేయలేదన్నారు. తమ ప్రాంతంలో రైతులు మిర్చి పంటను అధికంగా పండిస్తున్నారని, వారికి మార్కెటింVŠ  సౌకర్యం కల్పించాలని కోరారు. యంత్రాలతో ఆరపెడితే 24 గంటల్లో విక్రయించుకోవచ్చని, లేదంటే 12 నుంచి 14 రోజుల సమయం పడుతుందన్నారు. 
    – వ్యవసాయం చేయని పట్టా భూములను సర్వే చేసి వాటిలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ  అధికారులకు సూచించారు. 
     – సాయంత్రం స్త్రీ శిశు సంక్షేమ స్థాÄæూ సంఘం సమావేశం కమిటీ చైర్‌పర్సన్‌ కందుల సంద్యారాణి అధ్యక్షతన జరిగింది. జెడ్పీటీసీ శోభ మాట్లాడుతూ కందిపప్పు నాణ్యత లేదని, కోడిగుడ్లు చిన్నవిగా ఉంటున్నాయని, గ్యాస్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పిల్లలు రావడం లేదన్నారు. కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఇద్దరు ముగ్గురున్న కేంద్రాలను మూసివేయాలన్నారు. బాలసంరక్షణా కేంద్రాలు, అనాథాశ్రమాలకు అనుమతుల్లో నిబంధనలు అమలు చేయాలన్నారు.
    – ఈ సమావేశాల్లో జెడ్పీ సీఈఓ సూరజ్‌కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉదయం 10.30 గంటలకు సమావేశం జరగాల్సి ఉండగా, సభ్యులు రాకపోవడంతో కోరం లేక ఎదురుచూడాల్సి వచ్చింది. 11 గంటలకు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి రాగా, మరో 12 నిమిషాలకు ఇద్దరు సభ్యులు రావడంతో సమావేశాన్ని ప్రారంభించారు.
     
     
>
మరిన్ని వార్తలు